Ujjivan fixed deposit rates: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్ 8.25%-ujjivan small finance bank hikes fixed deposit rates now get up to 8 25 percent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ujjivan Small Finance Bank Hikes Fixed Deposit Rates Now Get Up To 8.25 Percent

Ujjivan fixed deposit rates: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్ 8.25%

Praveen Kumar Lenkala HT Telugu
Aug 09, 2022 05:27 PM IST

Ujjivan Small Finance Bank fixed deposit rate: రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది.

Ujjivan Small Finance Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
Ujjivan Small Finance Bank: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంచిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Twitter)

రూ. 2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఈరోజు ఆగస్టు 9, 2022 నుండి అమలులోకి వస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

బ్యాంక్ ఇప్పటివరకు సాధారణ ప్రజలకు 3.75 శాతం నుండి 6 శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 4.50 శాతం నుండి 6.75 శాతం వరకు వడ్డీ రేట్లతో ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలను అందిస్తోంది. 7 రోజుల నుండి 120 నెలల కాలవ్యవధి గల మెచ్యూరిటీలతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీములు అందుబాటులో ఉన్నాయి.

అయితే ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని పెట్టుబడిదారులకు అందించడానికి వీలుగా బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచింది. ఇప్పుడు సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 8.25 శాతం వడ్డీ రేటుతో ఫిక్స్‌డ్ డిపాజిట్లను అందిస్తోంది.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ FD రేట్లు

1. ఏడు రోజుల నుంచి 29 రోజుల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై గతంలో అందించే 2.90 శాతం వడ్డీ రేటు స్థానంలో బ్యాంక్ ఇప్పుడు 3.75 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

2. 30 రోజుల నుండి 89 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం బ్యాంక్ ఇప్పుడు 4.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇది గతంలో 3.50 శాతంగా ఉంది.

3. ఆరు నెలల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లు ఇప్పుడు 5 శాతం నుండి 5.25 శాతం వడ్డీని అందిస్తాయి.

4. 90 నుండి 179 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పుడు 4.25 శాతం నుండి 4.75 శాతం వడ్డీ రేటును అందిస్తాయి.

5. ఆరు నెలల నుండి 9 నెలల కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఇది గతంలో 4.75 శాతంగా ఉంది.

6. తొమ్మిది నెలల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు 5.75 శాతం వడ్డీ రేటును చెల్లిస్తుంది. ఇది గతంలో 5.05 శాతంగా ఉంది.

7. బ్యాంక్ 9 నెలల కంటే ఎక్కువ కాలంలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుంది.

8. 12 నెలల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.70 శాతానికి బదులుగా 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

9. 12 నెలలు ఆ పైనుంచి నుంచి 524 రోజులలో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లు ఇప్పుడు 7.20 శాతం వడ్డీ రేటును అందిస్తాయి.

9. 75 వారాల్లో (525 రోజులు) మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పుడు గరిష్టంగా 7.50 శాతం వడ్డీని ఇవ్వనున్నాయి.

10. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 526 రోజుల నుండి 18 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.20 శాతం వడ్డీ రేటును ఇస్తుంది.

11. 18 నెలల 1 రోజు నుండి 24 నెలల కంటే తక్కువ గల టర్మ్ డిపాజిట్లపై 6.60 శాతం నుండి 7.00 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.

12. 24 నెలల మెచ్యూరిటీ వ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది. అయితే 24 నెలల 1 రోజు నుండి 989 రోజుల వరకు టర్మ్ డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది.

13. 990 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇప్పుడు 7.50 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. ఇది గతంలో 7.20 శాతంగా ఉంది.

14. 36 నెలల 1 రోజు నుండి 42 నెలల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.25 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది.

15. 991 రోజుల నుండి 36 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 6.50 శాతం వడ్డీ రేటు కొనసాగుతుంది.

<p>Ujjivan Small Finance Bank : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు</p>
Ujjivan Small Finance Bank : ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు (ujjivansfb.in)

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్లాటినా FD రేట్లు

ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అనేది ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అందించే మరొక ప్రత్యేకమైన డిపాజిట్ ఆప్షన్. ప్లాటినా FD రేట్లు రూ. 15 లక్షల నుంచి రూ. 2 కోట్ల మధ్య గల డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయి.

డిపాజిటర్లు ఈ టర్మ్ డిపాజిట్ ప్లాన్ నుండి పాక్షికంగా లేదా ముందస్తుగా విత్‌డ్రా చేసుకోలేరు. అలాగే 60 ఏళ్లు దాటిన వారు ఈ ఎఫ్‌డీ తెరవలేరు. 12 నెలల నుండి 60 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.20 శాతం నుండి 7.40 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది. కస్టమర్‌లు ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 75 వారాలు(525 రోజులు), 990 రోజుల కాలవ్యవధులపై గరిష్టంగా 7.70 శాతం వడ్డీ రేటును పొందవచ్చు.

<p>ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు</p>
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్లాటినా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు (ujjivansfb.in)
WhatsApp channel