UGC NET June 2024: యూజీసీ నెట్ కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజులు పొడిగింపు-ugc net june 2024 nta extends registration deadline to may 15 details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ugc Net June 2024: యూజీసీ నెట్ కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజులు పొడిగింపు

UGC NET June 2024: యూజీసీ నెట్ కు దరఖాస్తు చేసుకునే గడువు మరో 5 రోజులు పొడిగింపు

HT Telugu Desk HT Telugu
May 10, 2024 09:46 PM IST

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకునే గడువును 2024 మే 15 వరకు పొడిగించారు. ఈ మేరకు యూజీసీ నెట్ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు యూజీసీ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in ద్వారా మే 15 లోపు అప్లై చేసుకోవచ్చు.

జూన్ 16వ తేదీన యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష
జూన్ 16వ తేదీన యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్ష (Hiindustan Times)

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ విండోను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) బుధవారం అంటే మే 15, 2024 వరకు పొడిగించింది. యూజీసీ-నెట్ జూన్ 2024కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఎన్టీఏ యూజీసీ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ - నెట్ జూన్ 2024 ఆన్లైన్ దరఖాస్తు ఫారం సమర్పణ గడువును మే 15 వరకు పొడిగించినట్లు యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ ట్వీట్ చేశారు.

మే 15 వరకు..

ఏన్టీఏ యూజీసీ - నెట్ జూన్ 2024 యొక్క ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మే 15, 2024 తో ముగుస్తుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు మే 16, 2024 రాత్రి 11:59 గంటల వరకు క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు/ నెట్ బ్యాంకింగ్/ యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు. కరెక్షన్ విండో మే 18 న ఓపెన్ అవుతుంది. మే 20, 2024 న క్లోజ్ అవుతుంది.

యూజీసీ నెట్ జూన్ 2024: అర్హత ప్రమాణాలు

హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, ఎలక్ట్రానిక్ సైన్స్ లలో యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు/ సంస్థల నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించిన జనరల్/ అన్ రిజర్వ్డ్/ జనరల్-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హులు. నాన్ క్రీమీలేయర్/షెడ్యూల్డ్ క్యాస్ట్(ఎస్సీ)/షెడ్యూల్డ్ ట్రైబ్(ఎస్టీ)/దివ్యాంగులు(పీడబ్ల్యూడీ)/థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు యూజీసీ నెట్ రాయడానికి మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

యూజీసీ నెట్ జూన్ 2024: పరీక్ష ఫీజు

యూజీసీ నెట్ 2024 జూన్ నోటిఫికేషన్ ప్రకారం జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,150. జనరల్-ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్ జెండర్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.325 గా నిర్ణయించారు. ఫీజు చెల్లింపునకు చివరి రోజు అంటే మే 16, 2024 రాత్రి 11.50 గంటలోపు చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్/ డెబిట్ కార్డు/ క్రెడిట్ కార్డు/ యూపీఐ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.

యూజీసీ నెట్ జూన్ 2024: ఇలా అప్లై చేయండి

యూజీసీ నెట్ జూన్ 2024 కు అప్లై చేయడానికి ఈ కింది స్టెప్ట్స్ ఫాలో కావాలి.

  • యూజీసీ నెట్ అధికారిక వెబ్సైట్ ugcnet.nta.ac.in. ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో కనిపిస్తున్న యూజీసీ నెట్ జూన్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • "new candidate register here" పై క్లిక్ చేయండి.
  • రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకే ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది.
  • పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్ ను ఏర్పాటు చేసుకోండి.
  • అప్లికేషన్ నెంబరును నోట్ చేసుకోండి.
  • అప్లికేషన్ నెంబరుతో లాగిన్ అవ్వండి.
  • అవసరమైన వివరాలను అందించండి.
  • అవసరమైన డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించండి
  • ధృవీకరణ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • భవిష్యత్తు రిఫరెన్స్ కొరకు ప్రింట్ అవుట్ తీసుకోండి.

యూజీసీ నెట్ జూన్ 2024: పరీక్ష తేదీ

యూజీసీ నెట్ జూన్ 2024 పరీక్షను జూన్ 16, 2024న నిర్వహించనున్నారు. పరీక్ష వ్యవధి 180 నిమిషాలు (3 గంటలు). పరీక్షను ఓఎంఆర్ (పెన్ అండ్ పేపర్) విధానంలో నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహా, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రెండు పేపర్స్ మధ్య విరామం ఉండదు. ఆన్ లైన్ దరఖాస్తు ఫారంలో ఇచ్చిన ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ తమదేనని అభ్యర్థులు నిర్ధారించుకోవాలి. ఎందుకంటే, ఆ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ లకే ఎన్టీఏ తదుపరి సమాచారం పంపిస్తుంది.

Whats_app_banner