UGC NET December 2024: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NET) డిసెంబర్ 2024 కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రారంభించింది. యూజీసీ నెట్ డిసెంబర్ 2024 కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ugcnet.nta.ac.in. ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్ డిసెంబర్ 2024 కు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 10గా నిర్ణయించారు.
యూజీసీ నెట్ డిసెంబర్ 2024 దరఖాస్తు ఫీజు జనరల్ లేదా అన్ రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు రూ.1,150. జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.325.
యూజీసీ నెట్ అనేది ఈ కింది విషయాల్లో అర్హతను నిర్ణయించడానికి జాతీయ స్థాయి పరీక్ష
(1) జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం
(2) అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియామకం, పీహెచ్డీలో ప్రవేశం
(3) భారతదేశంలోని విశ్వవిద్యాలయాలు, ఇతర కళాశాలలలో పీహెచ్డీలో ప్రవేశం
ఒక అభ్యర్థి కేవలం ఒక దరఖాస్తు ఫారాన్ని మాత్రమే సమర్పించడానికి అనుమతి ఉంది. దరఖాస్తు చేసుకునే ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లోని సూచనలను చదివి పాటించాలని కోరారు. ఈ ఆదేశాలను పాటించని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటిస్తామని ఎన్టీఏ (NTA) తెలిపింది. యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షకు దరఖాస్తు చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది ఉంటే అభ్యర్థులు ఏజెన్సీ హెల్ప్లైన్ నంబర్లు - 011- 40759000, 011-69227700 లేదా ugcnet@nta.ac.in ఈ-మెయిల్లో సంప్రదించవచ్చు. తాజా అప్డేట్ల కోసం nta.ac.in, ugcnet.nta.ac.in ఎన్టీఏ వెబ్సైట్లను సందర్శించవచ్చు.
టాపిక్