UGC NET Admit Card 2022 : యూజీసీ ఎన్​ఈటీ ఫేజ్​ 3 అడ్మిట్​ కార్డ్​లు విడుదల-ugc net admit card 2022 for phase 3 out download link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ugc Net Admit Card 2022 For Phase 3 Out Download Link Here

UGC NET Admit Card 2022 : యూజీసీ ఎన్​ఈటీ ఫేజ్​ 3 అడ్మిట్​ కార్డ్​లు విడుదల

Sharath Chitturi HT Telugu
Mar 02, 2023 11:59 AM IST

UGC NET phase 3 Admit Card 2022 : యూజీసీ ఎన్​ఈటీ ఫేజ్​ 3 అడ్మిట్​ కార్డ్​లు విడుదలయ్యాయి. వీటిని ఎన్​టీఏ విడుదల చేసింది. పూర్తి వివరాలు..

యూజీసీ ఎన్​ఈటీ ఫేజ్​ 3 అడ్మిట్​ కార్డ్​లు విడుదల
యూజీసీ ఎన్​ఈటీ ఫేజ్​ 3 అడ్మిట్​ కార్డ్​లు విడుదల

UGC NET phase 3 Admit Card 2022 : యూజీసీ ఎన్​ఈటీ 2022 ఫేజ్​ 3కి సంబంధించిన అడ్మిట్​ కార్డ్​లను విడుదల చేసింది ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ). ఫేజ్​ 3లో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు.. ఎన్​టీఏ యూజీసీ ఎన్​ఈటీ అధికారిక వెబ్​సైట్​ అయిన ugcnet.nta.nic.in లోకి వెళ్లి అడ్మిట్​ కార్డ్​లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

యూజీసీ ఎన్​ఈటీ డిసెంబర్​ 2022 ఫేజ్​ 3 పరీక్షలను మార్చ్​ 3 నుంచి 6 మధ్యలో నిర్వహిస్తోంది ఎన్​టీఏ. మొత్తం 8 సబ్జెక్ట్​లు ఇందులో ఉన్నాయి. అభ్యర్థులు.. తమ అప్లికేషన్​ నెంబర్​, డేట్​ ఆఫ్​ బర్త్​ ఆధారంగా అడ్మిట్​ కార్డ్​లను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

UGC NET admit card 2022 : స్టెప్​ 1:- ముందుగా యూజీసీ ఎన్​ఈటీ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో కనిపించే యూజీసీ ఎన్​ఈటీ అడ్మిట్​ కార్డ్​ 2022 ఫర్​ ఫేజ్​ 3 లింక్​ మీద క్లిక్​ చేయండి.

UGC NET admit card 2022 download : స్టెప్​ 3:- మీ లాగిన్​ డీటైల్స్​ ఎంటర్​ చేసి, సబ్మీట్​ బటన్​ క్లిక్​ చేయండి.

స్టెప్​ 4:- మీ అడ్మిట్​ కార్డ్​.. స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతుంది.

స్టెప్​ 5:- అడ్మిట్​ కార్డ్​ మీద క్లిక్​ చేసి డౌన్​లోడ్​ చేసుకోండి.

స్టెప్​ 6:- ప్రింటౌంట్​ తీసుకుని ఎగ్జామ్​ హాల్​కు వెళ్లండి.

అడ్మిట్ కార్డ్​లను డౌన్​లోడ్ చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, 011-40759000 నెంబర్​కు ఫోన్ చేయవచ్చు. లేదా ugcnet@nta.ac.in కు ఈమెయిల్ చేయవచ్చు.

ఫేజ్​ 1.. ఫేజ్​ 2..

UGC NET 2022 exams news : యూజీసీ నెట్ డిసెంబర్ 2022 ఫేజ్ 1 పరీక్షలు ఇప్పటికే పూర్తయ్యాయి. మొత్తం 57 సబ్జెక్టులకు ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ఫేజ్ 1 పరీక్షలు జరిగాయి. ఇక ఫేజ్​ 2లో భాగంగా 5 సబ్జెక్ట్​లు మంగళవారం నుంచి జరుగుతున్నాయి.

IPL_Entry_Point