UFO at Imphal airport : మణిపూర్‌లో ‘యూఎఫ్ఓ’ కలకలం.. రంగంలోకి దిగిన రఫేల్ జెట్స్!
UFO at Imphal airport : మణిపూర్‌లో యూఎఫ్ఓ కలకలం సృష్టించింది! ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో యూఎఫ్ఓ కనిపించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తేల్చేందుకు.. రఫేల్ జెట్స్ కూడా రంగంలోకి దిగాయట!
UFO at Imphal airport : యూఎఫ్ఓ (అన్ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్) కనిపించిందన్న వార్తలు.. అమెరికాలో ఎక్కువగా విపిస్తుంటాయి. అయితే.. ఇలాంటి వార్తే ఒకటి ఇండియాలో వెలుగులోకి వచ్చింది! మణిపూర్‌లో ఓ యూఎఫ్ఓ కనిపించిందట. అసలేం జరిగిందనేది తెలుసుకోవడానికి.. రెండు రఫేల్ ఫైటర్ జెట్స్‌ని.. ఆర్మీ ఆ ప్రాంతానికి పంపించిందట!
ఇదీ జరిగింది..
మణిపూర్ రాజధాని ఇంఫాల్ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు ఒక యూఎఫ్ఓ కనిపించిందని వార్తలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన.. పలు కమర్షియల్ ఫ్లైట్స్ రాకపోకలకు ఇబ్బంది కలిగించింది. కొంతసేపటి తర్వాత.. విమానాల కార్యకలాపాలు యథాతథంగా కొనసాగాయి.
UFO sighted in Manipur : కాగా.. మణిపూర్‌లో యూఎఫ్ఓ కనిపించిందన్న వార్తతో.. అక్కడికి సమీపంలోని ఓ ఎయిర్‌బేస్ నుంచి రెండు రఫేల్ విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
"యూఎఫ్ఓ కనిపించిందని మాకు సమాచారం వచ్చింది. దానిని కనుగొనేందుకు.. రెండు రఫేల్ విమానాలను వెంటనే పంపించాము," అని ఓ డిఫెన్స్ అధికారి.. మీడియాకు చెప్పినట్టు సమాచారం.
"రఫేల్‌లో అడ్వాన్స్డ్ సెన్సార్లు ఉన్నాయి. యూఎఫ్ఓలు కనిపించాయని చెబుతున్న ప్రాంతంలో.. రఫేల్ విమానాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కానీ అక్కడ వాటికి ఏం కనిపించలేదు," అని ఆ డిఫెన్స్ అధికారు వెల్లడించారు.
UFO in India news : "వీడియోలో కనిపిస్తున్న యూఎఫ్ఓ ఆచూకీని తెలుసుకునేందుకు సంబంధిత విభాగాలు కృషిచేస్తున్నాయి," అని ఆ అధికార వివరించారు.
తాజా పరిణామాల మధ్య ఒక కీలక ప్రకటన చేసింది భారత వాయుసేనకు చెందిన ఈస్టెర్న్ కమాండ్.
"ఇంఫాల్ విమానాశ్రయం నుంచి అందిన విజువల్ ఇన్పుట్స్ ఆధారంగా.. ఎయిర్ డిఫెన్స్ రెస్పాన్స్ సిస్టెమ్ని యాక్టివేట్ చేశాము. ఆ తర్వాత.. యూఎఫ్ఓగా చెబుతున్న ఆ చిన్న పరికరం.. కనిపించలేదు," అని ట్వీట్ చేసింది ఈస్టెర్న్ కమాండ్.
UFO Rafale jets : యూఎఫ్లో ఎలియెన్స్ (గ్రహాంతరవాసులు) ఉంటాయని భావిస్తుంటారు. ఇక ఇంఫాల్ విమానాశ్రయానికి సమీపంలో కనిపించిన ఆబ్జెక్ట్.. నిజంగా యూఎఫ్ఓనేనా? అందులో ఏలియన్స్ ఉన్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ తరహా వార్తలు ఎప్పుడు వినిపించినా.. సమాధానాలు పెద్దగా తెలియవు. అవి మిస్టరీగానే మిగిలిపోతాయి!
సంబంధిత కథనం