అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ ఉబర్ డ్రైవర్ తన కార్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై తుపాకీ తీసి 'గెట్ అవుట్' అని దూకుడుగా అడుగుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మయామి ర్యాపర్ క్రిస్సీ సెలెస్ అలియాస్ బాంబ్ ఆస్ క్రిస్సీ ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేశారు. తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి ఏ మార్గంలో వెళ్లాలనే దానిపై వాదన పెరిగిందని, అకస్మాత్తుగా డ్రైవర్ గన్ తీసి బెదిరించిందని క్రిస్సీ వివరించారు.
ఈ వీడియోలో ఆమె, ఆమె స్నేహితుడు తాము వెళ్లాల్సిన ప్రదేశానికి చేరేందుకు ఫాలో కావాల్సిన డైరెక్షన్స్ విషయంలో ఉబర్ మహిళా డ్రైవర్ తో వాదన ప్రారంభమైంది. అది కాసేపటికి తీవ్రమైన ఆర్గ్యుమెంట్ గా మారింది. ప్రయాణంలో ఉండగా, ఎక్కడ మలుపు తీసుకోవాలో క్రిస్సీ డ్రైవర్ కు చెప్పుతున్న సమయంలో.. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఆ మహిళా డ్రైవర్ ‘రైడ్ పూర్తయింది. కార్లో నుంచి దిగండి’ అని ఆ ప్రయాణికులను హెచ్చరించింది. వారు అలాగే, వాదిస్తుండడంతో, తన వద్ద ఉన్న గన్ తిసి వారికి ఎయిమ్ చేసి బెదిరించింది. డ్రైవర్ ప్రవర్తనపై క్రిస్సీ తప్పుడు కామెంట్ చేయడంతో డ్రైవర్ అలా స్పందించినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.
వాదన తీవ్రమైన సమయంలో ‘ముందు నా వాహనంలోని నుంచి దిగండి. మీరు ఇక రైడ్ లో లేరు. గెట్ ఔట్’ అంటూ ఆ డ్రైవర్ క్రిస్సీ, ఆమె బాయ్ ఫ్రెండ్ ను హెచ్చరించింది. ఆ సమయంలో క్రిస్సీ ఆ మహిళా డ్రైవర్ కళ్ల గురించి కామెంట్ చేస్తుంది. దాంతో, ఆగ్రహానికి లోనైన డ్రైవర్ తన గన్ ను తీసి వారిని బెదిరిస్తుంది. ఆ వీడియోను ఆన్ లైన్ లో షేర్ చేసిన ర్యాపర్.. వైరల్ వీడియోలోని కామెంట్ సెక్షన్ ను డిసేబుల్ చేసింది.
ఈ వీడియోపై ఉబర్ స్పందించింది. "ఇది ఆందోళనకరమైనది, మరియు ఇది జరిగినందుకు మేము చాలా చింతిస్తున్నాము" అని ఉబర్ తెలిపింది. ఉబర్ మార్గదర్శకాలు డ్రైవర్లు తుపాకులు తీసుకెళ్లడాన్ని స్పష్టంగా నిషేధించాయి. అందువల్ల, తమ ప్లాట్ఫామ్ నుండి డ్రైవర్ ను తొలగించినట్లు వెల్లడించింది. హాలీవుడ్ పోలీసుల నేతృత్వంలోని దర్యాప్తునకు సహకరిస్తున్నట్లు ఉబర్ తెలిపింది.
సంబంధిత కథనం
టాపిక్