Uber : 50కి.మీల కోసం రూ. 3వేలు- ‘ఉబెర్​ రాక్స్​.. కస్టమర్​ షాక్స్​!’-uber charges heavily for ride within mumbai customer says flight to goa cheaper ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Uber Charges Heavily For Ride Within Mumbai, Customer Says "Flight To Goa Cheaper"

Uber : 50కి.మీల కోసం రూ. 3వేలు- ‘ఉబెర్​ రాక్స్​.. కస్టమర్​ షాక్స్​!’

Sharath Chitturi HT Telugu
Jul 03, 2022 08:07 PM IST

Uber charges in Mumbai : 50 కి.మీల ప్రయాణం కోసం మీ క్యాబ్​ మీకు రూ. 3వేల ఛార్జ్​ చేస్తే? ముంబైలో ఇదే జరిగింది!

ఉబెర్​
ఉబెర్​ (REUTERS)

Uber charges in Mumbai : ఉబెర్​.. ఓలా.. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అదే విధంగా.. రద్దీ సమయాల్లో, వర్షం పడుతున్నప్పుడు.. ఈ క్యాబ్​లు వసూలు చేసే రేట్ల గురించి కూడా కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరిని షాక్​కు గురి చేసే ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 50.కిమీల ప్రయాణం కోసం ఉబెర్​ రూ. 3వేలు ఛార్జ్​ చేస్తోంది!

ట్రెండింగ్ వార్తలు

ముంబైలో జరిగింది ఓ ఘటన. ఉబెర్​ క్యాబ్​ ఛార్జీలకు సంబంధించిన స్క్రీన్​ షాట్​ను ఓ వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. వర్షం పడుతున్నప్పుడు.. ఇంటికి వెళ్లాలని క్యాబ్​ బుక్​ చేసేందుకు ప్రయత్నించాడు ముంబైవాసి శ్రవన్​ కుమార్​. ఆ రేట్లు చూసి షాక్​ అయ్యాడు.

ఛార్జీలు.. ఉబెర్​గో లో రూ. 3,041- ప్రీమియర్​లో రూ. 4,081- ఎక్స్​ఎల్​లో రూ .5,159గా చూపించాయి. అది కూడా 50.కిమీల ప్రయాణం కోసం!

'నా ఇంటికి ఉబెర్​ క్యాబ్​లో వెళ్లడం కన్నా.. ముంబై- గోవా విమానం రేట్లు చాలా తక్కువ' అని శ్రవన్​ కుమార్​ ట్వీట్​ చేశాడు.

ఈ ట్వీట్​ వైరల్​గా మారింది. చూసిన వారందరు షాక్​కు గురవుతున్నారు.

ఓ నెటిజన్​ అయితే.. ఏకంగా లెక్కలు వేసేశాడు. "డీజిల్​-పెట్రోల్​ ధరలు పెరిగాయా ఏంటి? 10కి.మీల మైలేజ్​ వచ్చినా.. 50కిలోమీటర్లు రూ. 500 అవుతుంది. వాళ్లు రెండున్నర రెట్లు ఎక్కువ తీసుకుంటున్నారు," అని రాసుకొచ్చాడు.

రేట్ల పెంపు లేకపోయినా.. తాను రూ. 800- రూ. 1000 చెల్లిస్తానని ఆ ట్వీట్​కు బదులిచ్చాడు శ్రవన్ ​కుమార్​.

"ఉబెర్​ ఎక్స్​ఎల్​ ఛార్జీలతో పోల్చుకుంటే.. నాసిక్​ శివారుల్లో 1బీహెచ్​కే ఫ్లాట్​ తీసుకోవచ్చు," అని మరో నెటిజన్​ ట్వీట్​ చేశాడు. 'నిలువుగా దోచుకుంటున్నారు,' అని మరో వ్యక్తి అన్నాడు. ‘ఉబెర్​ రాక్స్​.. కస్టమర్​ షాక్స్​’ అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్