Jail term for typo | టైపింగ్ మిస్టేక్‌తో 18 నెల‌లు జైళ్లో..!-typo in lab report landed nigerian man in jail 18 months ago ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Typo In Lab Report Landed Nigerian Man In Jail 18 Months Ago

Jail term for typo | టైపింగ్ మిస్టేక్‌తో 18 నెల‌లు జైళ్లో..!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

వేరే అత‌డు చేసిన చిన్న టైపింగ్ మిస్టేక్‌తో ఒక వ్య‌క్తి 18 నెల‌ల పాటు జైలు పాలైన విషాదం ఇది. నిషేధిత డ్ర‌గ్స్ కాని వాటిని నిషేధిత డ్ర‌గ్స్‌గా పేర్కొన‌డంతో నైజీరియా నుంచి వ‌చ్చిన ఒక వ్య‌క్తి అన్యాయంగా జైలు పాల‌య్యాడు.

Jail term for typo | అక్టోబ‌ర్ 23, 2020లో నైజీరియా నుంచి ముంబై వ‌చ్చిన ఒక నైజీరియా పౌరుడిని ఏర్‌పోర్ట్‌లో సాధార‌ణ చెకింగ్‌లో భాగంగా త‌నిఖీ చేసిన‌ప్పుడు.. అత‌డి వ‌ద్ద సుమారు 116.19 గ్రాముల కొకైన్ లాంటి ప‌దార్ధం, ఎక్‌స్ట‌సీ టాబ్లెట్లుగా క‌నిపిస్తున్న 41 గ్రాముల బ‌రువున్న పిల్స్‌ను అధికారులు గుర్తించారు. వెంట‌నే అత‌డిని అదుపులోకి తీసుకుని, ఆ ప‌దార్ధాల‌ను ఫొరెన్సిక్ సైన్స్ లాబొరేట‌రీకి టెస్టింగ్‌కు పంపించారు. ఆ త‌రువాత‌, ఆ నైజీరియ‌న్ నుంచి స్వాధీనం చేసుకున్న‌వి కొకైన్‌, ఎక్‌స్ట‌సీ టాబ్లెట్లు కావ‌ని, అవి లైడోకైన్‌, టాపెంట‌డోల్‌, కెఫీన్ అని ఆ రిపోర్ట్‌లో వ‌చ్చింది.

ట్రెండింగ్ వార్తలు

Jail term for typo | పొర‌పాటున‌..

అయితే, ఆ లైడోకైన్‌, టాపెంట‌డోల్‌ లు నిజానికి భార‌త్‌లో అమ‌ల్లో ఉన్న డ్ర‌గ్ నిరోధ‌క చ‌ట్ట‌మైన‌ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) చ‌ట్ట పరిధిలోకి రావు. కానీ ఈ రిపోర్ట్‌లో మాత్రం అవి NDPS చ‌ట్ట ప‌రిధిలోని నిషేధిత డ్ర‌గ్స్ అని పొర‌పాటున‌ పేర్కొన్నారు. దాంతో, వెంట‌నే ఆ నైజీరియ‌న్‌ను అరెస్ట్ చేసి, జైలు పాలు చేశారు. అప్ప‌టి నుంచి అత‌డు జైళ్లోనే మ‌గ్గుతున్నాడు. తాజాగా, ముంబై హైకోర్టులో ఆ నైజీరియ‌న్ వేసుకున్న బెయ‌ల్ పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో రిపోర్ట్‌లో చోటు చేసుకున్న టైపింగ్ తప్పు గురించి నిందితుడి త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్టుకు వివ‌రించారు. ఈ పొర‌పాటు గురించి ప్ర‌భుత్వ న్యాయ‌వాది నుంచి వివ‌ర‌ణ కోరిన న్యాయ‌మూర్తి, అది టైపింగ్ త‌ప్పేన‌ని నిర్ధారించారు.

Jail term for typo | ప‌రిహారం ఇవ్వండి

దాంతో, కోర్టు వెంట‌నే అత‌డికి బెయిల్ మంజూరు చేసింది. అలాగే, ఆ వ్య‌క్తికి ఎంత ప‌రిహారం ఇవ్వాలో నిర్ణ‌యించాల‌ని మ‌హారాష్ట్ర హోం సెక్ర‌ట‌రీని ఆదేశించింది. ఒక‌వేళ ప‌రిహారం ఎంత ఇవ్వాల‌నే విష‌యంలో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఆగ‌స్ట్ 12లోగా నిర్ణ‌యం తీసుకోని ప‌క్షంలో.. ప‌రిహారం ఎంత ఇవ్వాలో తామే నిర్ణ‌యిస్తామ‌ని జ‌స్టిస్ భార‌తి దాంగ్రే స్ప‌ష్టం చేశారు. అన్యాయంగా, వేరే వ్య‌క్తి చేసిన త‌ప్పుకు ఆ నైజీరియ‌న్‌ను శిక్షించ‌డంపై న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

WhatsApp channel