Rajasthan rape case : ఇద్దరు మైనర్లను బంధించి అత్యాచారం! 20 రోజుల పాటు..
Rajasthan rape case : ఇద్దరు మైనర్లు అత్యాచారానికి గురైన ఘటన రాజస్థాన్‌లో కలకలం సృష్టించింది. వీరిలో ఒకరిని, నిందితులు 20 రోజుల పాటు బంధీగా ఉంచినట్టు సమాచారం.
Rajasthan rape case : రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మైనర్లను బంధీగా చేసిన కొందరు.. వారిపై అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
మొదటి బాలిక కథ..
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ ఘటన జరిగింది. 17ఏళ్ల వయస్సు ఉన్న బాలిక.. గత ఆదివారం రాత్రి, ఇంట్లో వాళ్లతో గొడవపడింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి వచ్చేసింది. సింధి క్యాంప్ బస్‌స్టాండ్ వరకు వెళ్లింది. అక్కడే, మోను (19) అనే వ్యక్తిని కలసింది. మైనర్‌ను మాటల్లోకి దింపిన మోను, ఆమెకు సాయం చేస్తానని నమ్మించాడు. అనంతరం ఆమెను హోటల్‌కు తీసుకెళ్లి రేప్ చేశాడు.
సోమవారం ఉదయం బాలిక.. హోటల్ నుంచి ఎలాగో అలా తప్పించుకుంది. ఇంటికి వెళ్లి, తనకి జరిగినది వివరించింది. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులకు.. బాధితురాలు మరో విషయం చెప్పింది. హోటల్లో మరో బాలికను కూడా చూసినట్టు వివరించింది.
రెండో బాలిక కథ..
Rajasthan crime news : 14ఏళ్ల బాలిక తల్లిదండ్రులు విడాకులు తీసుకుని వేరువేరుగా ఉంటున్నారు. ఈ బాలిక తరచూ ఉత్తర్ ప్రదేశ్, హరియాణాలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళుతూ ఉండేది. కానీ వారు తనని పట్టించుకోవడం లేదని ఆమే కుమిలిపోయింది. తీవ్ర దుఖంలో ఉన్న సమయంలో ఆ బాలిక సొదరి, ఆమెకు ఒక సలహా ఇచ్చింది. "జైపూర్‌లో నాకు తెలిసిన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు మోను. అతని దగ్గరికి వెళ్లు. చాలా నమ్మకస్తుడు. నీకు సాయం చేస్తాడు," అని చెప్పింది.
కొత్త జీవితంపై ఆశలతో గత నెలలో జైపూర్‌కు వెళ్లిన మైనర్, మోనును కలిసింది. ఆ తర్వాత ఆమె జీవితం మలుపు తిరిగింది! బాలికను హోటల్‌కు తీసుకెళ్లిన మోను, ఆమెను రేప్ చేశాడు. 20 రోజుల పాటు బంధీగా ఉంచాడు. ఆ సమయంలో మరో ఇద్దరు మైనర్లు కూడా ఆమెను రేప్ చేశారు.
సరిగ్గా ఇదే సమయంలో మొదటి బాలిక హోటల్‌కు వెళ్లింది. ఆమెపై రేప్ జరిగింది. అదే సమయంలో రెండో బాలికను చూసింది.
చివరికి..
Minors raped in Rajasthan : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జలాపుర ప్రాంతంలోని హోటల్లో మోనును అరెస్ట్ చేశారు. హోటల్ నుంచి రెండో బాలికను రక్షించారు. ఆమెను కేర్ హోంకు తరలించారు. గురువారం నాటికి ఇద్దరు మైనర్లను కూడా అరెస్ట్ చేశారు.
కాగా.. బాలికలను రేప్ చేసే ముందు, వారి నుంచి మోను డబ్బులు కూడా దోచుకున్నట్టు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు చేపట్టి, నిందితులను కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం