Twitter paid subscription in India : ఇండియాలో 'బ్లూ టిక్'​ పెయిడ్ సర్వీస్​ షురూ.. ధర ఎంతంటే!​-twitter rolls out paid subscription service in india check cost details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Twitter Rolls Out Paid Subscription Service In India. Check Cost Details

Twitter paid subscription in India : ఇండియాలో 'బ్లూ టిక్'​ పెయిడ్ సర్వీస్​ షురూ.. ధర ఎంతంటే!​

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 11, 2022 07:43 AM IST

Twitter paid subscription in India : అమెరికాలో బ్లూ టిక్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​ను ప్రారంభించిన ట్విట్టర్​.. తాజాగా ఇండియాలో కూడా అమలు చేసింది. నెలకు రూ. 719తో బ్లూ టిక్​ వెరిఫికేషన్​ ట్యాగ్​ను ఇస్తోంది ట్విట్టర్​.

ఇండియాలో ట్విట్ర్​ బ్లూ టిక్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​ షురూ..!
ఇండియాలో ట్విట్ర్​ బ్లూ టిక్​ పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​ షురూ..! (AP)

Twitter paid subscription in India : ఇండియాలో బ్లూ టిక్​ సర్వీసులను ప్రారంభించింది ట్విట్టర్​. ఇండియాలో నెలకు రూ. 719తో బ్లూ టిక్​ వెరిఫికేషన్​ ట్యాగ్​ను ఇస్తోంది ఈ సోషల్​ మీడియా సంస్థ. అమెరికాలో బ్లూ టిక్​ సర్వీసుల కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సి వస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ట్విట్టర్​ బ్లూకు సబ్​స్క్రైబ్​ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్​ వచ్చినట్టు.. ఇండియాలోని కొంతమంది యూజర్లు తెలిపారు. అయితే.. ఈ అప్డేట్​ ప్రస్తుతాని ఐఫోన్​లో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇది అందరికీ అందుబాటులోకి వస్తుందని సమాచారం.

Twitter blue tick cost in India : సబ్​స్క్రైబ్​ చేసుకునే యూజర్లకు.. ఎలాంటి వెరిఫికేషన్​ లేకుండాన ట్విట్టర్​ బ్లూ టిక్​ వచ్చేస్తుంది. ట్విట్టర్​కు సంబంధించిన అన్ని విషయాల్లో.. బ్లూ టిక్​ సబ్​స్క్రైబర్లకు 'ప్రయారిటీ' లభిస్తుందని తెలుస్తోంది.

అయితే.. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్లూ టిక్​ సబ్​స్క్రిప్షన్​ను తీసుకురావడంతో యూజర్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎలాన్​ మస్క్​ నిర్ణయం..

Elon Musk Twitter latest news : దాదాపు 6 నెలల తర్వాత ట్విట్టర్​ను అధికారికంగా సొంతం చేసుకున్న అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​.. వస్తూనే సంస్థలో అనేక మార్పులు చేశారు. ఇందులో భాగంగానే బ్లూ టిక్​కు పెయిడ్​ సబ్​స్క్రిప్షన్​ను అమలు చేశారు. రానున్న రోజుల్లో ట్విట్టర్​ మోనిటైజేషన్​ను కూడా ప్రవేశపెడతామని స్పష్టం చేశారు.

అంతేకాకుండా.. సంస్థలో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. ట్విట్టర్​ ఇండియాలో 90శాతం మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

'ట్విట్టర్​ దివాళా తీస్తుంది..'

Twitter Bankruptcy : సంస్థలో తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు సీనియర్​ ఎగ్జిక్యూటివ్​లు ట్విట్టర్​కు గుడ్​ బై చెబుతున్నారు. ట్విట్టర్​ను వీరు నూతన శిఖరాలకు చేర్చుతారని ఎలాన్​ మస్క్​ గతంలో భావించారు. ఇక ఇప్పుడు.. వీరు ఉద్యోగాల నుంచి తప్పుకోవడంతో.. ట్విట్టర్​పై కీలక వ్యాఖ్యాలు చేశారు ఎలాన్​ మస్క్​. భవిష్యత్తులో.. ట్విట్టర్​ దివాళా తీసే అవకాశం ఉందని తెలిపారు.

అయితే.. ట్విట్టర్​ దివాళా తీస్తుందన్న ఎలాన్​ మస్క్​ వ్యాఖ్యలపై ఆ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇలా సీనియర్​ అధికారులు క్విట్​ చేస్తుండటంపై యూఎస్​ ఫెడరల్​ ట్రేడ్​ కమిషన్​ ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులను గమనిస్తున్నట్టు పేర్కొంది. ఈ రాజీనామాలతో రెగ్యూలేటరీ ఆర్డర్లను ట్విట్టర్​ ఉల్లంఘించే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

"ట్విట్టర్​లో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను మేము ట్రాక్​ చేస్తూనే ఉన్నాము. ఏ సీఈఓ, కంపెనీ చట్టాలకు అతీతం కాదు. చట్టాల్లోని నిబంధనలకు అందరు కట్టుబడి ఉండాలి. చట్టాలను వాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాము," అని ఎఫ్​టీసీ డైరక్టర్​ ఆఫ్​ పబ్లిక్​ అఫైర్స్​ డౌగ్లస్​ ఫర్రార్​ తెలిపారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం