Twitter hacked : ట్విట్టర్‌కు హ్యాకింగ్ దెబ్బ.. 20కోట్ల ఆకౌంట్స్‌పై ప్రభావం!
Twitter hacked : ట్విట్టర్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు కలకలం రేపుతోంది. 20కోట్లకుపైగా ఆకౌంట్స్ హ్యాకింగ్‌కు గురయ్యాయని తెలుస్తోంది. వీటి నుంచి హ్యాకర్లు.. ఈమెయిల్ ఐడీలు దొంగలించారని సమాచారం.
Twitter hacked : ట్విట్టర్‌పై 'హ్యాకింగ్' పిడుగు పడింది. 20కోట్లకు (200 మిలియన్) పైగా ట్విట్టర్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనట్టు తెలుస్తోంది. హ్యాకర్స్.. సంబంధిత యూజర్ల ఈమెయిల్ ఐడీలను దొంగిలించి.. ఆన్లైన్ హ్యాకింగ్ ఫోరంలో అందుబాటులో ఉంచినట్టు ఓ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించారు.
ఈమెయిల్ అడ్రస్‌లు.. ఫోన్ నెంబర్లు..!
ఈ పరిణామాలతో టార్గెటెడ్ ఫిషింగ్, డాక్సింగ్ వంటివి జరుగుతాయని.. ఇజ్రాయెల్ సైబర్సెక్యూరిటీృ మానిటరింగ్ సంస్థ హుడ్సన్ రాక్ సహ వ్యవస్థాపకుడు ఆలోన్ గాల్ అభిప్రాయపడ్డారు. తాను చూసిన అతిపెద్ద 'డేటా లీక్స్'లో ఈ తాజా ఘటన ఒకటి అని వివరించారు.
Twitter accounts hacked : ట్విట్టర్ హ్యాకింగ్ విషయాన్ని తొలిసారిగా గతేడాది డిసెంబర్ 24న పోస్ట్ చేశారు ఆలోన్ గాల్. ఈ వ్యవహారంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు నిజమేనా? ఒకవేళ నిజమే అయితే.. ఈ వ్యవహారంపై ఎలాంటి దర్యాప్తు చేపట్టారు? భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? వంటి మీడియా ప్రశ్నలకు ట్విట్టర్ ఇంకా జవాబు చెప్పలేదు.
డేటా బ్రీచ్‌కు కారణమైన హ్యాకర్స్, వారి లోకేషన్స్‌కు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు కూడా లేవు. అయితే.. ఈ డేటా బ్రీచ్ అనేది 2021 తొలినాళ్లల్లో జరిగి ఉంటుందని తెలుస్తోంది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను సొంతం చేసుకునే కొన్నేళ్ల ముందే ఈ ఘటన జరిగింది!
Elon Musk Twitter latest news : తొలుత.. 40కోట్లకుపైగా ట్విట్టర్ యూజర్ల ఆకౌంట్ల హ్యాకింగ్ గురయ్యాయని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆ సంఖ్య 20కోట్లకు తగ్గింది. ఈ యూజర్స్ అకౌంట్స్ నుంచి ఈమెయిల్ అడ్రస్‌లు, ఫోన్ నెంబర్లు దొంగలించినట్టు తెలుస్తోంది.
Twitter latest news : ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో పెను సంచనలనంగా మారింది. 20కోట్లకుపైగా యూజర్స్ ఈమెయిల్ ఐడీ హ్యాకింగ్‌కు గురవ్వడం పెద్ద విషయమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే.. అష్టకష్టాలు పడుతున్న ట్విట్టర్.. ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఈ టెక్ యుగంలో ‘డేటా’ అనేది అత్యంత కీలకమైన విషయంగా మారింది. డేటా మన వద్ద ఉంటే.. బిలియన్ డాలర్లు సంపాదించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. హ్యాకర్స్ వీటిని అక్రమంగా దొంగలించి.. ఇతరులకు అమ్ముకుంటుండటం.. యూజర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోంది. ఈ వ్యవహారంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు అన్ని సామాజిక మాధ్యమాలు హ్యాకింగ్‌పై పోరాటం చేస్తున్నాయి. అయినప్పటికీ.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.
సంబంధిత కథనం