Twitter Blue tick subscription : ట్విట్టర్​ ‘బ్లూ టిక్​’ సర్వీసు నిలిపివేత.. ఎందుకంటే!-twitter blue tick subscription unavailable following rise in fake verified accounts report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Twitter Blue Tick Subscription Unavailable Following Rise In Fake Verified Accounts: Report

Twitter Blue tick subscription : ట్విట్టర్​ ‘బ్లూ టిక్​’ సర్వీసు నిలిపివేత.. ఎందుకంటే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 12, 2022 06:32 AM IST

Twitter Blue tick subscription unavailable : బ్లూ టిక్​ సబ్​స్క్రిప్షన్​ సర్వీసును నిలిపివేసింది ట్విట్టర్​. ఫేక్​ ఖాతాల సమస్య విపరీతంగా పెరిగిపోవడమే ఇందుకు కారణం!

 ట్విట్టర్​ ‘బ్లూ టిక్​’ సర్వీసు నిలిపివేత.. ఎందుకంటే!
ట్విట్టర్​ ‘బ్లూ టిక్​’ సర్వీసు నిలిపివేత.. ఎందుకంటే! (HT_PRINT)

Twitter Blue tick subscription unavailable : ట్విట్టర్​ 'బ్లూ టిక్​' సబ్​స్క్రిప్షన్​కు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. ఫేక్​ అకౌంట్​లు విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా.. బ్లూ టిక్​ సబ్​స్క్రిప్షన్​ సర్వీసును నిలిపివేసింది ట్విట్టర్​. ప్రముఖ బ్రాండ్​ల పేరుతో ఖాతాలు తెరుస్తూ, కొందరు యూజర్లు బ్లూ టిక్​ను సంపాదించుకుంటుండటంతో ట్విట్టర్​ ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పుడెలా?

ట్విట్టర్​ను అధికారికంగా కొనుగోలు చేసిన వెంటనే.. సంస్థలో కీలక మార్పులు తీసుకొచ్చారు అపర కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​. భారీ మొత్తంలో ఉద్యోగాలను తొలగిస్తున్నారు. మిగిలిన ఉద్యోగులకు.. వారానికి 80 గంటలు పని చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్​ బ్లూ టిక్​కు సబ్​స్క్రిప్షన్​ ప్రణాళిక రచించారు. బ్లూ టిక్​ కావాలంటే నెలకు 8 డాలర్లు చెల్లించాలని స్పష్టం చేశారు. కొన్ని వారాల క్రితమే దీనిని అమలు చేశారు.

Twitter Blue tick subscription suspended : ఇండియాలో.. ట్విట్టర్​ బ్లూ టిక్​ సబ్​స్క్రిప్షన్​ సర్వీసు గురువారమే అందుబాటులోకి వచ్చాయి. ట్విట్టర్​ బ్లూకు సబ్​స్క్రైబ్​ చేసుకోవాలని తమకు నోటిఫికేషన్​ వచ్చినట్టు.. ఇండియాలోని కొంతమంది యూజర్లు తెలిపారు. అయితే.. ఈ అప్డేట్​ ప్రస్తుతాని ఐఫోన్​లో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది. నెలకు రూ. 719 చెల్లిస్తే బ్లూ టిక్​ పొందవచ్చు. త్వరలో అందరికి ఈ సర్వీసు అమల్లోకి వస్తుంది అని భావిస్తున్న తరుణంలో.. దీనిని మొత్తానికి సస్పెండ్​ చేసింది ట్విట్టర్​.

మరోవైపు.. హై ప్రొఫైల్​ అకౌంట్​లకు 'ఆఫీషియల్​ బ్యాడ్జీ'లను తిరిగి ప్రవేశపెట్టింది ట్విట్టర్​. బిజినెస్​, మీడియా సంస్థ ఖాతాల ప్రొఫైల్స్​ కింద గ్రే బ్యాడ్జీ కనిపిస్తోంది. ఇలా చేస్తే ఫేక్​ అకౌంట్​ల సమస్య తగ్గుతుందని ట్విట్టర్​ భావిస్తోంది.

ఫేక్​ ఖాతాల బెడద..!

ట్విట్టర్​కు ఫేక్​ ఖాతాల బెడద ఎప్పటి నుంచో ఉంది! కానీ బ్లూ టిక్​ సర్వీసు మొదలుపెట్టినప్పటి నుంచి ఇది మరింత పెరిగింది. చాలా మంది.. ఫేక్​ అకౌంట్​లు సృష్టించుకుని, ప్రముఖ బ్రాండ్లు, సెలబ్రిటీల పేర్లు పెట్టుకుంటున్నారు. డబ్బులు చెల్లించి ట్విట్టర్​ బ్లూ టిక్​ను పొందుతున్నారు.

Elon Musk Twitter : గతంలో.. అకౌంట్​ను వెరిఫై చేసిన తర్వాతే బ్లూ టిక్​ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు.. 8 డాలర్లు చెల్లిస్తే.. ఎలాంటి వెరిఫికేషన్​ లేకుండానే బ్లూ టిక్​ ఇచ్చేస్తున్నారు. ఫలితంగా ఈ సమస్యలు ఎదురయ్యాయి.

ఈ వ్యవహారంపై ఎలాన్​ మస్క్​ స్పందించారు.

"పారడీ కోసం సృష్టిస్తున్న అకౌంట్​లన్నింటికీ.. పేరులోనూ పారడీ ఉండాలి. బయోలో మాత్రమే కాదు," అని ఎలాన్​ మస్క్​ ట్వీట్​ చేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం