Turkey earthquake survivor : శిథిలాల కింద నుంచి 278 గంటల తర్వాత బయటకొచ్చిన మృత్యుంజయుడు!-turkey finds new survivor nearly 12 days after earthquake ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Turkey Earthquake Survivor : శిథిలాల కింద నుంచి 278 గంటల తర్వాత బయటకొచ్చిన మృత్యుంజయుడు!

Turkey earthquake survivor : శిథిలాల కింద నుంచి 278 గంటల తర్వాత బయటకొచ్చిన మృత్యుంజయుడు!

Sharath Chitturi HT Telugu

Turkey earthquake survivor : టర్కీలో మరో అద్భుతం జరిగింది! భూకంపం సంభవించిన 278 గంటల తర్వాత.. ఓ వ్యక్తిని శిథిలాల కింద నుంచి బయటకు తీశారు సహాయక సిబ్బంది.

శిథిలాల కింద నుంచి 278 గంటల తర్వాత బయటకొచ్చిన మృత్యుంజయుడు

Turkey earthquake survivor : టర్కీ భూకంపం నేపథ్యంలో.. ఓ 45ఏళ్ల వ్యక్తిని తాజాగా శిథిలాల కింద నుంచి రక్షించారు సహాయక సిబ్బంది. దాదాపు 12 రోజులు.. అంటే 278 గంటల పాటు ఆయన శిథిలాల కింద ఉండి, సజీవంగా బయటకి వచ్చారు.

మృత్యుంజయుడు..

12 రోజుల క్రితం.. టర్కీలో 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. టర్కీతో పాటు సరిహద్దులోని సిరియా సైతం దెబ్బతింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 40వేలు దాటింది. హటాయ్​ ప్రాంతంలో భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. 12 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Turkey earthquake rescue operation : ఈ నేపథ్యంలో భూకంపం సంభవించిన 278 గంటల తర్వాత హకన్​ యాసినోగ్లు అనే వ్యక్తిని.. శిథిలాల కింద నుంచి బయటకు తీశారు సహాయక సిబ్బంది. ఆయన్ని స్ట్రెచర్​పై తీసుకెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. స్ట్రెచర్​ నుంచి కింద పడకుండా ఉండేదుకు.. ఆయనను కట్టేశారు. గోల్డెన్​ థర్మల్​ జాకెట్​లో ఆయన శరీరాన్ని చుట్టారు.

శిథిలాల నుంచి పక్కనే ఉన్న అంబులెన్స్​లోకి హకన్​ యాసినోగ్లును తీసుకెళ్లారు. అక్కడి నుంచి వెంటనే ఆసుపత్రికి తరలించారు. వీడియోలో ఆయన ముఖం కనిపించలేదు.

Turkey earthquake death toll : శిథిలాల కింద నుంచి ఎవరైనా బయటకు వస్తుంటే.. ఆ ప్రాంతాల్లో చప్పట్ల మోత మోగేది. అందరు ఆనందంతో ఉండేవారు. కానీ ఈసారి అలాంటి వాతావరణం కనిపించలేదు. అందరు బాధతో ఉండిపోయారు.

ఇక గురువారం, శుక్రవారాల్లో మరో ముగ్గురిని సహాయక సిబ్బంది రక్షించారు. వీరిలో ఓ 14ఏల్ల బాలుడు ఉన్నాడు. మరోవైపు దేశంలోని సుమారు 200 ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్టు ప్రభుత్వం వెల్లించింది. టర్కీలో మొత్తం 11 రాష్ట్రాలు ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో సహాయక చర్యలు పూర్తయ్యాయి.

41వేల మంది మృతి..

Turkey earthquake latest updates today : టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం ధాటికి మృతుల సంఖ్య 41వేలు దాటింది. లక్షకుపైగా మంది ప్రజలు గాయపడ్డారు. 10లక్షలకుపైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అత్యల్ప ఉష్ణోగ్రతల మధ్య వారందరు నీడ లేకుండానే జీవిస్తున్నారు.

టర్కీ, సిరియాలను ఆదుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నాయి. ఇండియా ఇప్పటికే ఆపరేషన్​ దోస్త్​ చేపట్టింది. ఇక అమెరికా వంటి అగ్రదేశాలు.. ఆర్థికంగా సాయం చేస్తున్నాయి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.