Tunisha Sharma Suicide Case: యువ నటి తునీషా శర్మ (20) ఆత్యహత్య సంచలనంగా మారింది. ఈ కేసులో ఆమె మాజీ బాయ్‍ఫ్రెండ్, సహచర నటుడు శీజాన్ ఖాన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో అతడు ఉన్నాడు. అయితే విచారణ సందర్భంగా శ్రద్ధా వాకర్ మర్డర్ కేసు (Shraddha Walker Murder Case)ను పోలీసుల వద్ద అతడు ప్రస్తావించినట్టు సమాచారం. శ్రద్ధా వాకర్ హత్య కేసు బయటికి వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితుల కారణంగా తాను తునీషాతో విడిపోవాల్సి వచ్చిందని చెప్పాడని పోలీస్ వర్గాలు వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. లివిన్ పార్ట్‌నర్ శ్రద్ధా వాకర్‌ను అఫ్తాబ్ పునావాలా.. కిరాతకంగా చంపి 35 ముక్కలుగా నరికాడు. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ కేసు బయటికి వచ్చాక దేశంలో ఏర్పడిన పరిస్థితుల వల్లే తాను తునీషాతో బ్రేకప్ చేసుకున్నానని శీజాన్ పోలీసులతో చెప్పాడని సమాచారం.,ఈ కారణాలతో..Tunisha Sharma Suicide Case: శ్రద్ధా వాకర్ హత్య కేసు బయటికి వచ్చిన తర్వాత దేశంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా తాను తునీషాతో విడిపోయానని శీజాన్ ఖాన్ పోలీసుల విచారణ చెప్పినట్టు తెలిసింది. తమ ఇద్దరి మతాలు వేరని, ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం కూడా చాలా ఎక్కువని శీజాన్ చెప్పినట్టు సమాచారం.,శ్రద్ధా వాకర్‌ను ఆఫ్తాబ్ పునావాలా ఈ ఏడాది మేలో అత్యంత కిరాతకంగా చంపాడు. నవంబర్‌లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది లవ్ జిహాద్ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. మతం మారేందుకు అంగీకరించని కారణంగా శ్రద్ధను అఫ్తాబ్ చంపి ఉంటాడని ఆరోపించారు. అయితే, తునీషా ఆత్మహత్య కేసు విషయంలో అలాంటి కోణం లేదని విచారణలో తేలినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.,గతంలోనూ ఆత్మహత్యాయత్నంTunisha Sharma Suicide Case: బ్రేకప్ అయిన కొన్ని రోజుల తర్వాత తునీషా శర్మ ఆత్మహత్య చేసుకునేందుకు ఓసారి ప్రయత్నించిందని శీజాన్ ఖాన్ పోలీసుల విచారణ చెప్పాడని సమాచారం. “చనిపోయే కొన్ని రోజుల ముందు కూడా ఆత్మహత్య చేసుకునేందుకు తునీషా ప్రయత్నించింది. ఆ సమయం నేను ఆమెను కాపాడా. తునీషాను జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె తల్లికి చెప్పా” అని పోలీసుల విచారణలో శీజాన్ ఖాన్ చెప్పాడని తెలిసింది.,నా కూతురిని శీజాన్ మోసం చేశాడు: తునీషా తల్లిపెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కూతురిని శీజాన్ ఖాన్ మోసం చేశాడని తునీషా శర్మ తల్లి వనిత ఆరోపించారు. ఆమెను వాడుకొని వదిలేశాడని చెప్పారు. వేరే మహిళతో సంబంధం కొనసాగిస్తూ తునీషాతో కూడా అతడు రిలేషన్‍షిప్‍లో ఉన్నాడని ఆమె చెప్పారు. శీజాన్‍ను వదలకూడదని, అతడికి శిక్ష పడాల్సిందేనని వనిత అన్నారు.,ఈనెల 24వ తేదీన టీవీ నటి తునీషా శర్మ (20) ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని వాసాయ్ ప్రాంతంలో షూటింగ్ జరుగుతున్న సమయంలోనే టీ బ్రేక్‍లో ఉరేసుకొని సూసైడ్‍కు పాల్పడ్డారు. ఆత్మహత్య చేసుకునే కొద్ది సమయం ముందే ఆమె శీజాన్‍తో కలిసి ఆమె భోజనం కూడా చేశారని సమాచారం.,కాగా, తునీషా శర్మ ఆత్యహత్య చేసుకున్నాక ఆమె బాయ్‍ఫ్రెండ్ అయిన శీజాన్ ఖాన్‍ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని వాసాయ్ కోర్టు అతడికి నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.