Rishi Sunak losing in UK PM race : ఓటమి అంచున రిషి సునక్-truss on brink of power as uk tories finish voting ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Truss On Brink Of Power As Uk Tories Finish Voting

Rishi Sunak losing in UK PM race : ఓటమి అంచున రిషి సునక్

Sudarshan Vaddanam HT Telugu
Sep 02, 2022 08:51 PM IST

Rishi Sunak losing in UK PM race : బ్రిటన్ ప్రధాని పీఠంపై భారతీయ సంతతి వ్యక్తి కూర్చోబోతున్నాడన్న భారతీయుల ఆనందం ఆవిరి కాబోతోందా? తొలి దశ ఎన్నికల్లో దూసుకుపోయిన రిషి సునక్ చివరకు వచ్చేసరికి వెనుకబడి పోయారా? బ్రిటన్ ప్రధాని పీఠం భారతీయ సంతతి వ్యక్తికి చేజారినట్లేనా?

రిషి సునక్
రిషి సునక్ (AFP)

Rishi Sunak losing in UK PM race : బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయ సంతతి నేత రిషి సునక్ వెనుకబడ్డారు. ఆయన ప్రత్యర్థి లిజ్ ట్రస్ విజయం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. చివరి రౌండ్ ఎన్నికల్లో ఫలితం తేల్చే కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు లిజ్ ట్రస్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak in UK PM race : రిషి వెనుకడుగు

పార్టీ ఎంపీల మద్ధతు కూడగట్టే రౌండ్లలో ప్రత్యర్థుల కన్నా ఎంతో ముందున్న రిషి సునక్.. చివరి రౌండ్ ఎన్నికకు వచ్చేసరికి వెనుకబడిపోయారు. తొలి రౌండ్లలో విజయం సాధించి తుది పోటీదారుల జాబితాలో చోటు సంపాదించిన ఇద్దరిలో ఒకరిని కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు ప్రధాని గా ఎన్నుకుంటారు. ప్రస్తుతం, అలా తుది ఇద్దరు పోటీదారులుగా నిలిచింది రిషి సునక్, లిజ్ ట్రస్. వీరిద్దరూ కూడా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో కీలక పదవులు నిర్వహించిన వారే కావడం విశేషం.

Rishi Sunak in UK PM race : సెప్టెంబర్ 5న..

ఈ ఇద్దరిలో తుది విజేతగా నిలిచి, బ్రిటన్ ప్రధాని పీఠం అధిష్టించేదెవరో తేలేది సెప్టెంబర్ 5వ తేదీన. అయితే, తుది రౌండ్ ప్రచార సరళిని గమనిస్తున్న విశ్లేషకులు.. ఈ రౌండ్ లో రిషి సునక్ పై లిజ్ ట్రస్ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తుందని చెబుతున్నారు. పార్టీలో లిజ్ ట్రస్ మద్దతుదారుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం రిషి సునక్ సైతం అంగీకరించారు.

Rishi Sunak losing in UK PM race : ప్రచారం ముగిసింది

ప్రచారం చేసుకోవడానికి వీరిద్దరికి దాదాపు నెల రోజులకు పైగా సమయం ఇచ్చారు. ఆ సమయంలో ఇరువురు నేతలు దేశవ్యాప్తంగా పర్యటించారు. మూడు ముఖాముఖి టీవీ చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానిగా తాము దేశానికి ఏం చేయాలనుకుంటున్నామో వివరించారు. బోరిస్ జాన్సన్ మంత్రివర్గంలో రిషి ఆర్థిక శాఖను, లిజ్ ట్రస్ విదేశాంగ వ్యవహారాలను చూశారు. తుది రౌండ్ లో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2 లక్షల మంది కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఈ ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటిస్తారు. తదుపరి ప్రధాని జనవరి 2025 వరకు పదవిలో ఉంటారు.

WhatsApp channel