Trump twitter account : ట్విట్టర్లోకి ట్రంప్ రీఎంట్రీ.. కానీ!
Trump twitter account : శాశ్వత బహిష్కరణకు గురైన డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించినట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.
Trump twitter account : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్లోకి రీఎంట్రీ ఇచ్చారు. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించినట్టు.. ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్రంప్ ఖాతాను పునరుద్ధరించాలా? వద్దా? అని మస్క్ పెట్టిన ట్విట్టర్ పోల్‌కు నెటిజన్లు సానుకూలంగా స్పందించారని మస్క్ పేర్కొన్నారు.
ట్రెండింగ్ వార్తలు
"ప్రజలు స్పందించారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించాము. వాక్స్ పపోలీ, వాక్స్ డెయ్," అని ట్వీట్ చేశారు ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్. వాక్స్ పపోలీ, వాక్స్ డెయ్ అనేది లాటిన్ పదం. దీని అర్థం.. 'ప్రజల మాటలు.. దేవుడి మాటలతో సమానం'.
Trump twitter account restored : ట్విట్టర్లో 237మిలియన్ మంది డైలీ యూజర్లు ఉన్నారు. వీరిలో 15మిలియన్ మంది.. మస్క్ చేసిన పోల్‌కు స్పందించారు. 51.8శాతం ఓట్లు.. ట్రంప్‌నకు సానుకూలంగా, 48.2శాతం ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి.
ట్రంప్ ఈజ్ బ్యాక్..
2020 అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గతేడాది జనవరిలో అమెరికాలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. ముఖ్యంగా క్యాపిటల్ భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. విధ్వంసం సృష్టించారు. వారి రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల మధ్య.. ట్రంప్ ఖాతాలను తొలగిస్తున్నట్టు.. ఫేస్బుక్, ట్విట్టర్ ప్రకటించాయి.
Trump Elon Musk twitter poll : ట్రంప్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసే ముందు ఆయనకు 88మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా ఖాతాలు ఫ్రీజ్ అయిన కొన్ని నెలలకు.. సొంతంగా ఓ యాప్‌ను తీసుకొచ్చారు ట్రంప్. దాని పేరు 'ట్రూత్ సోషల్'.
అయితే.. ట్విట్టర్‌ను ట్రంప్ వినియోగించే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు.
"నాకు మస్క్ అంటే ఇష్టం. ఆయన క్యారెక్టర్ అంటే ఇష్టం. నా కోసం ఓ పోల్ పెట్టారు. కానీ నాకు ట్రూత్ సోషల్ అనే సామాజిక మాధ్యమం ఉంది. నేను ట్విట్టర్లోకి తిరిగి రాకపోవచ్చు. ట్విట్టర్‌ని వాడేందుకు నా వద్ద కారణాలేవీ లేవు," అని.. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ వెల్లడించారు.
‘2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా..’
Donald Trump 2024 elections : 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించారు ట్రంప్. మరోసారి వైట్‍హౌస్ పీఠాన్ని దక్కించుకునేందుకు రేసులో ఉంటానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల పోటీ కోసం అమెరికా ఫెడరల్ ఎలక్షన్ కమిషన్‍కు పత్రాలు సమర్పించారు.
ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో (US Mid-term election) రిపబ్లికన్ పార్టీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. అయినా ట్రంప్ ఏ మాత్రం తగ్గడం లేదు. తమ పార్టీ మరింత బలపడిందని, అమెరికన్ల కలను సాకారం చేసి తీరతానని అన్నారు. అందుకే మళ్లీ పోటీలో ఉంటానని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Donald Trump: మళ్లీ పోటీ చేస్తా.. గెలిచి తీరుతా: డొనాల్డ్ ట్రంప్
November 16 2022
Donald Trump : 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డొనాల్డ్ ట్రంప్!
November 12 2022
Trump praises Modi | ``భారత్ కు నన్ను మించిన ఫ్రెండ్ లేడు``
September 08 2022