Tripura rape case : బాలికపై అత్యాచారం.. ప్రియుడు, అతని స్నేహితులు కలిసి!
Tripura rape case : త్రిపురలో ఓ బాలిక అత్యాచారానికి గురైంది. ఏడాదిగా ఆమె రిలేషన్లో ఉన్న ఓ యువకుడు ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. అతను, మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేశాడు. ఈ ఘటన త్రిపురలో జరిగింది.
Tripura rape case : త్రిపురలో దారుణ ఘటనలో వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఆమె ప్రియుడు, అతని స్నేహితులు ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి..
గోమతి జిల్లాలో నివాసముంటున్న ఓ 15ఏళ్ల బాలిక.. ఓ యువకుడితో ఏడాదిగా రిలేషన్లో ఉంది. ఇటీవలే.. ఆ యువకుడు ఆ మైనర్‌కు కాల్ చేసి రాయ్బరిలోని ఓ ప్రాంతానికి రమ్మని పిలిచాడు. గత శనివారం.. యువకుడు చెప్పిన ప్రాంతానికి ఆ బాలిక వెళ్లింది.
Youth rapes girl : అక్కడి నుంచి ఆ బాలికను ఆ యువకుడు.. ఎవరు లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ.. ఆ యువకుడి స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఆ సమయంలోనే ఆ బాలికపై ఆ ముగ్గురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అపస్మారక స్థితిలోకి జారుకున్న బాలికను అక్కడే విడిచిపెట్టి వెళ్లిపోయారు.
స్పృహలోకి వచ్చిన బాలిక.. పోలీసులకు ఫోన్ చేసింది. ఘటనాస్థలానికి పరుగులు తీసిన పోలీసులు.. ఆమెను రక్షించారు. ఈ క్రమంలోనే ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
"బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లాము. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. సోమవారం ఉదయం నిందితులను అరెస్ట్ చేశాము. ఘటనపై దర్యాప్తు సాగుతోంది. పోక్సో చట్టం కింద ఆ ముగ్గురిపై కఠిన చర్యలు తీసుకుంటాము," అని పోలీసులు చెప్పారు.
దళిత మహిళపై..
Uttar Pradesh crime news : దేశంలో మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మహిళపై పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బాలియాలో కలకలం సృష్టించింది.
ఈ ఘటన 4న చోటుచేసుకుంది. బాధిత మహిళ.. తన కుటుబంతో కలిసి నగ్రా ప్రాంతంలో నివాసముంటోంది. ధీరేంద్ర సింగ్ అనే వ్యక్తి.. ఆ 23ఏళ్ల దళిత మహిళ ఇంటి పక్కనే జీవిస్తున్నాడు. ఆమెపై అతడి కన్నుపడింది. సమయం కోసం ఎదురుచూశాడు.
UP rape case : ఈ క్రమంలోనే.. ఈ నెల 4న.. ఎవరూ లేని సమయంలో మహిళ ఇంట్లోకి ప్రవేశించాడు ధీరేంద్ర. ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. నిందితుడు ధీరేంద్రను అరెస్ట్ చేసి, అతనిపై ఐపీసీ 376, ఎస్సీ/ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు.
మరోవైపు వైద్య పరీక్షల కోసం మహిళను పోలీసులు ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల రిపోర్టు అందిన తర్వాత.. కేసును మరింత వేగంగా దర్యాప్తు చేసి.. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం