Minor kills his own family : కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!-tripura minor held for allegedly murdering his own family ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tripura: Minor Held For Allegedly Murdering His Own Family

Minor kills his own family : కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 06, 2022 03:39 PM IST

Minor kills his own family : ఆ బాలుడి వయస్సు 15. బడికి వెళ్లాల్సిన వయస్సులో దారుణానికి ఒడిగట్టాడు ఆ మైనర్​. తల్లితో సహా నలుగురు కుటుంబసభ్యులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన త్రిపురలో చోటుచేసుకుంది.

కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!
కుటుంబసభ్యులను దారుణంగా చంపిన మైనర్​!

Minor kills his own family : త్రిపురలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ 15ఏళ్ల బాలుడు.. సొంత కుటుంబసభ్యులను గొడ్డలితో నరికి చంపేశాడు! ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది.

ట్రెండింగ్ వార్తలు

కారణమేంటి..?

అగర్తలకు 90కి.మీల దూరంలో ఉంది కమల్​పూర్​. అందులోని దురై శివ్​బరీ అనే ప్రాంతంలో ఓ మైనర్​.. తన కుటుంబంతో నివాసముంటున్నాడు.

కాగా.. శనివారం అర్ధరాత్రి.. ఆ మైనర్​ బాలుడు.. తన తాత, తల్లి, సోదరితో పాటు మరో ఇద్దరిని దారుణంగా హత్య చేశాడు. గొడ్డలితో నరికి చంపేశాడు. తాత వయస్సు 70ఏళ్లు. తల్లికి 32, సోదరికి 10ఏళ్ల వయస్సు ఉంటుందని తెలుస్తోంది.

హత్య చేసిన సమయంలో.. భారీ శబ్దాలతో మ్యూజిక్​ పెట్టి, కుటుంబసభ్యుల అరుపులను ఎవరికి వినిపించకుండా చేశాడు ఆ మైనర్​. కుటుంబసభ్యులను చంపేసిన తర్వాత.. వారి మృతదేహాలను ఇంటి వెనుక భాగంలో పాతేశాడు ఓ బాలుడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.

ఘటన జరిగిన సమయంలో బాలుడి తండ్రి ఇంట్లో లేడు. బయట నుంచి ఇంటికి తిరిగి వెళ్లేసరికి.. ఆ తండ్రికి గదుల్లో రక్తం కనిపించింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరి మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

కాగా.. ఘటనాస్థలానికి సమీపంలోని ఓ మార్కెట్​లో పోలీసులు.. ఆదివారం ఉదయం నిందితుడిని పట్టుకున్నారు.

"కమల్​పూర్​ పోలీస్​ స్టేషన్​లో ఓ మర్డర్​ కేసు నమోదైంది. నిందితుడిని హలాహలి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాము," అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు.

ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, హత్యకు గల కారణాలను తెలుసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా.. ఇంట్లో ఆ బాలుడు దొంగతనానికి పాల్పడినట్టు తెలిసిందని అన్నారు.

ఆ బాలుడికి టీవీ చూడటం అలవాటు అని, క్రైమ్​ షోలు చాలా ఎక్కువగా చూసి ఎంజయ్​ చేసేవాడని.. స్థానికులు మీడియాకు వివరించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం