Love Jihad: “10 మంది ముస్లిం యువతులను ట్రాప్ చేయండి”: ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు-trap 10 muslim women pramod muthalik to hindu men to counter love jihad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Trap 10 Muslim Women Pramod Muthalik To Hindu Men To Counter Love Jihad

Love Jihad: “10 మంది ముస్లిం యువతులను ట్రాప్ చేయండి”: ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 20, 2023 02:59 PM IST

Pramod Muthalik Comments: ప్రమోద్ ముతాలిక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ (Love Jihad)ను ఎదుర్కొనేందుకు అంటూ మాట్లాడారు.

Love Jihad: “10 మంది ముస్లిం యువతులను ట్రాప్ చేయండి”: ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు (PTI File Photo)
Love Jihad: “10 మంది ముస్లిం యువతులను ట్రాప్ చేయండి”: ముతాలిక్ వివాదాస్పద వ్యాఖ్యలు (PTI File Photo) (HT Photo)

Pramod Muthalik Comments: కర్ణాటకలో శ్రీరామ్ సెనె (Sri Ram Sene) అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ (Pramod Muthalik) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాద్ (Love Jihad)ని ఎదుర్కొనేందుకు అంటూ తీవ్రంగా మాట్లాడారు. హిందూ యువకులు.. ముస్లిం మహిళలను ట్రాప్ చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

మేం రక్షణ ఇస్తాం

Pramod Muthalik Comments: ముస్లిం అమ్మాయిలను ట్రాప్ చేసే యువకులకు శ్రీ రామ సెనె తరఫున రక్షణ కల్పిస్తామని ప్రమోద్ ముతాలిక్ అన్నారు. బాగల్‍కోట్‍లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కర్ణాటకలో ఏం జరుగుతుందో మాకు స్పష్టంగా తెలుసు. నా దగ్గర ఓ పరిష్కారం ఉంది. లవ్ జిహాద్‍కు మనం ఓ యువతిని కోల్పోతే.. ప్రతీకారంగా మనం 10 మంది ముస్లిం మహిళలను ఆకర్షించి ట్రాప్ చేయాలి. ఒకవేళ ఇది జరిగితే.. శ్రీ రామ్ సెనె మీ వెనుక ఉంటుంది. పూర్తి రక్షణ కల్పిస్తుంది. ఉద్యోగం కూడా చూపిస్తుంది. బహిరంగ శక్తుల నుంచి మనం మన మతాన్ని కచ్చితంగా రక్షించుకోవాలి” అని ప్రమోద్ ముతాలిక్ అన్నారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది.

యువతులను హెచ్చరించాలి

Pramod Muthalik Comments: లవ్ జిహాదీ ట్రాప్‍లో పడకుండా హిందూ యువతులను హెచ్చరించాలని ప్రమోద్ ముతాలిక్ పిలుపునిచ్చారు. “లవ్ జిహాద్ ఉచ్చులో పడడం వల్ల మనం దేశవ్యాప్తంగా వందలాది మంది యువతులను కోల్పోతున్నాం. దీని గురించి యువతులను హెచ్చరించే పనిని మనం తప్పకుండా బాధ్యతగా తీసుకోవాలి” అని చెప్పారు.

వివాదాస్పద, మతతత్వ వ్యాఖ్యలు చేయడం ప్రమోద్ ముతాలిక్‍కు కొత్తేం కాదు. హిందుత్వ సిద్ధాంతాన్ని పాటించినందుకు, రక్షించినందుకు సొంత మెంబర్ల నుంచే తాను గతంలో అడ్డంకులు ఎదుర్కొన్నానని ఆయన గత వారం అన్నారు. బీజేపీ అనుసరిస్తున్న నకిలీ, ద్విముఖ హిందుత్వం వల్ల పార్టీకి మున్ముందు నష్టమే జరుగుతుందని అభిప్రాయపడ్డారు.

కోస్టల్ కర్ణాటక ప్రాంతంలోని కార్కలా అసెంబ్లీ స్థానానికి ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలని ప్రమోద్ ముతాలిక్ భావిస్తున్నారని వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు.

IPL_Entry_Point