Karnataka news: రైలు పట్టాలపై మందు పార్టీ; మత్తులో పట్టాలపైనే నిద్ర; ఉదయానికి నుజ్జునుజ్జైన శరీరాలు-train runs over three sleeping on tracks in inebriated state ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka News: రైలు పట్టాలపై మందు పార్టీ; మత్తులో పట్టాలపైనే నిద్ర; ఉదయానికి నుజ్జునుజ్జైన శరీరాలు

Karnataka news: రైలు పట్టాలపై మందు పార్టీ; మత్తులో పట్టాలపైనే నిద్ర; ఉదయానికి నుజ్జునుజ్జైన శరీరాలు

HT Telugu Desk HT Telugu
Jul 20, 2024 10:03 PM IST

Karnataka news: మద్యం అలవాటు, నిర్లక్ష్య పూరిత వైఖరి ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది. రైలు పట్టాలపై మందు పార్టీ చేసుకుని, ఆ పట్టాలపైనే నిద్రపోయిన ముగ్గురు యువకులు ఆ పట్టాలపైననే, ఆ నిద్రలోనే రైలు చక్రాల కింద నలిగి చనిపోయారు.

కర్నాటక క్రైమ్ న్యూస్
కర్నాటక క్రైమ్ న్యూస్

Karnataka news: మద్యం మత్తులో రైలు పట్టాలపై నిద్ర పోయిన ముగ్గురు యువకులు రైలు పట్టాల కింద నలిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్నాటక లోని కొప్పాల్ లో జరిగింది. రాత్రి 9.30 గంటల సమయంలో హుబ్బళ్లి-సింధనూర్ ఎక్స్ ప్రెస్ రైలు గంగావతి నగర్ కు చెందిన మౌనేష్ పత్తారా (23), సునీల్ (23), వెంకట్ భీమనాయక (20) అనే ముగ్గురిపైకి దూసుకెళ్లిందని రైల్వే పోలీసు సూపరింటెండెంట్ ఎస్ కే సౌమ్యలత తెలిపారు.

yearly horoscope entry point

మందు పార్టీ చేసుకుని..

రాత్రి 9:30 గంటల సమయంలో హుబ్బళ్లి-సింధనూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి ఆ ముగ్గురు యువకులు రైల్వే ట్రాక్ పై పార్టీ చేసుకుంటున్నారు. అనంతరం మద్యం మత్తులో పట్టాలపైననే నిద్రపోయారు. వారి ఇళ్లు ఆ ట్రాక్ కు సమీపంలోనే ఉంటాయి. ఆ పట్టాలపై రైళ్లు ప్రయాణిస్తాయని వారికి తెలుసని, అయితే, మద్యం మత్తులో వారికి అలాగే ట్రాక్ పై నిద్రపోయారని రైల్వే పోలీసులు తెలిపారు.

పోలీసు కేసు నమోదు

రాత్రి 11 గంటల సమయంలో కర్నాటకలోని గంగావతి రైల్వే స్టేషన్ మాస్టర్ నుంచి ఈ సంఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న గదగ్ కు చెందిన పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కొప్పల్ లో రైల్వే పోలీస్ స్టేషన్ లేనందున, ఈ ప్రాంతం 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న గదగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. బీఎన్ఎస్ సెక్షన్ 194 (అసహజ మరణం) కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.