Solar eclipse 2024 : సంపూర్ణ సూర్య గ్రహణాన్ని ఆదిత్య ఎల్1 చూడలేదు.. కారణం ఇదే!
Total solar eclipse 8 April : ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణాన్ని, భారత దేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 చూడలేదు! ఇందుకు ఒక కారణం ఉంది. అదేంటంటే..
Solar eclipse of april 8 2024 : సంపూర్ణ సూర్య గ్రహణం కోసం ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ అరుదైన ఘట్టాన్ని చూసేందుకు అందరు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సూర్య గ్రహణాన్ని.. భారత దేశ తొలి సోలార్ అబ్జర్వేటరీ అయిన ఆదిత్య ఎల్1 ట్రాక్ చేయలేదు! ఇందుకు గల కారణాన్ని శాస్త్రవేత్తలు వివరించారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
సంపూర్ణ సూర్య గ్రహణాం- ఆదిత్య ఎల్1..
భారత కాలమానం ప్రకారం.. ఈ సూర్య గ్రహణం.. ఏప్రిల్ 8 రాత్రి 9 గంటల 12 నిమిషాలకు మొదలై.. ఏప్రిల్ 9 తెల్లవారుజాము 2 గంటల 22 నిమిషాలకు పూర్తవుతుంది. సంపూర్ణ సూర్య గ్రహణం మాత్రం.. ఏప్రిల్ 8 రాత్రి 10 గంటల 8 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంటే.. భారత దేశ ప్రజలు.. ఈ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని కళ్లారా వీక్షించలేరు. నార్త్ అమెరికాలో మాత్రం ఈ సంపూర్ణ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది.
Solar eclipse in India : ఇది చాలా అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం! దాదాపు దశాబ్ద కాలం తర్వాత.. న్యూయార్క్‌లోని పశ్చిమ, ఉత్తర భాగాలకు ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం లభించింది. ఇక సంపూర్ణ గ్రహణం సమయంలో చంద్రుడు.. సూర్యుడిని పూర్తిగా కప్పేయనున్నాడు. ఆ సమయంలో చీకటి అలుముకుంటుంది. ఏప్రిల్ 8న సంభవించే సంపూర్ణ సూర్య గ్రహణం.. నార్త్ అమెరికా, మెక్సికో, కెనడాలను కవర్ చేస్తుంది.
కానీ భారత దేశ ఆదిత్య ఎల్1 శాటిలైట్ మాత్రం.. ఈ 2024 సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించలేదు! ఇందుకు ఒక ముఖ్య కారణం ఉంది. సిస్టెమ్లో ఫాల్ట్ లేదు. కానీ 365 రోజులు, 24x7 పాటు సూర్యుడిని నిరంతరాయంగా ట్రాక్ చేసే విధంగా.. ఆదిత్య ఎల్1ని ప్లేస్ చేసింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఎలాంటి గ్రహణం సంభవించినా.. సూర్యుడి వ్యూని శాటిలైట్ కోల్పోకుండా ఉండే విధంగా.. స్పాట్‌ని ఎంచుకుంది ఇస్రో. చంద్రుడు.. ఆదిత్య ఎల్1కి వెనుక భాగంలో ఉండటంతో.. 2024 సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించలేదు.
Aditya L1 Solar eclipse : "భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్ 1 (ఎల్1)లో ఆదిత్య ఎల్1ని పెట్టింది ఇస్రో. ఇది హాలో ఆర్బిట్ కిందకు వస్తుంది. ఆ ఆర్బిట్‌లో ఉండే శాటిలైట్లకు.. గ్రహణాలతో ఇబ్బంది ఉండదు. సోలార్ యాక్టివిటీలను నిరంతరాయంగా పరిశీలించవచ్చు," అని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.
కృత్రిమ సూర్య గ్రహణం..
Total solar eclipse 2024 : సూర్యుడి మీద అధ్యయనం కోసం ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఆదిత్య ఎల్1 బరువు 1,500 కేజీలు. దీని వ్యయం రూ. 400 కోట్లు. ఇంకా చెప్పాలంటే.. అధ్యయనంలో భాగంగా.. ఆదిత్య ఎల్1 కృత్రిమ గ్రహణాలను రూపొందించుకోగలదు. ఇందుకోసం ఒక స్పెషల్ ఇన్‌స్ట్రుమెంట్‌ని శాటిలైట్‌కి అమర్చింది ఇస్రో. దీని పేరు.. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరొనాగ్రఫి. దీని సాయంతో.. సన్ డిస్క్ నుంచి లైట్ ఎలిమినేట్ అయిపోతుందని, ఆ పరిస్థితులను ఆదిత్య ఎల్1 పరిశీలించి, అధ్యయనం చేస్తుంది ఇస్రో ఛైర్మన్ సోమ్‌నాథ్ తెలిపారు.
సంబంధిత కథనం