Blast in Afghanistan | అఫ్గాన్ లో మరో భారీ బాంబు దాడి-toll from mosque blast in western afghanistan rises to 18 dead ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Toll From Mosque Blast In Western Afghanistan Rises To 18 Dead

Blast in Afghanistan | అఫ్గాన్ లో మరో భారీ బాంబు దాడి

HT Telugu Desk HT Telugu
Sep 02, 2022 05:49 PM IST

Blast in Afghanistan | శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పశ్చిమ అఫ్గానిస్తాన్ లోని హెరాత్ నగరంలో భారీ బాంబు పేలుడు జరిగింది. హెరాత్ లోని ప్రముఖ మసీదు వెలుపల చోటు చేసుకున్న ఈ పేలుడులో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. పాతిక మందికి పైగా గాయాల పాలయ్యారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Blast in Afghanistan | అఫ్గాన్ లో బాంబు పేలుళ్ల పరంపర కొనసాగుతోంది. తాాాజాగా శుక్రవారం మధ్యాహ్న ప్రార్థనల సమయంలో హెరాత్ నగరంలో ఒక ప్రముఖ మసీదు వెలుపల శక్తిమంతమైన బాంబు పేలింది. ఈ పేలుడులో అఫ్గానిస్తాన్ కు చెందిన ప్రముఖ తాలిబన్ అనుకూల మత పెద్ద మరణించారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Blast in Afghanistan | గజడ్ గఢ్ మసీదు.

హెరాత్ నగరంలోని గజర్ గఢ్ మసీదులో శుక్రవారం మధ్యాహ్నం భారీ బాంబు పేలుడు జరిగింది. మసీదు కు వెలుపల జరిగిన ఈ పేలుడులో ప్రార్థనల కోసం మసీదులోకి వెళ్తున్న ప్రముఖ తాలిబన్ అనుకూల ఇమామ్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అన్సారీ చనిపోయారు. ఆయనతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరో పాతిక మంది వరకు గాయపడ్డారని, క్షతగాత్రుల్లో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని, అందువల్ల మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని స్థానిక మీడియా వెల్లడించింది.

Blast in Afghanistan | ప్రభావశీల ఇమామ్

ఇమామ్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అన్సారీ అఫ్గాన్లోని ప్రముఖ ఇమామ్ ల్లో ఒకరు. తాలిబన్ ప్రభుత్వానికి అనుకూల ఇమామ్ గా పేరుగాంచారు. `అత్యంత ధైర్యవంతుడైన మార్గదర్శి ఇమామ్ ఈ దారుణ దాడిలో అమరులయ్యారు` అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలను రెచ్చగొట్టేలా, ఆవేశపూరితంగా ప్రసంగిస్తారన్న పేరున్న ఇమామ్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ అన్సారీ. ‘ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ చిన్న పని చేసినవారికైనా.. తల నరికేయడమే సరైన శిక్ష’ అని ఇటీవల ఆయన వ్యాఖ్యానించారు. తాలిబన్ జెండాను ఎగరేయడానికి ఎన్నో త్యాగాలు చేసిన విషయాన్ని మరిచిపోకూడదన్నారు. బాంబు దాడుల్లో చనిపోయిన రెండో తాలిబన్ అనుకూల ఇమామ్ ఈయన. గత నెలలో రహీముల్లా హక్కానీ అనే ప్రముఖ తాలిబన్ అనుకూల ఇమామ్ కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర సంస్థ జరిగిన బాంబుదాడిలో చనిపోయారు.

IPL_Entry_Point