Changes in TOEFL : టోఫెల్ లో స్వల్ప మార్పులు; ఇకపై రెండు గంటలే ఈ పరీక్ష..-toefl to be shortened by an hour candidates to get real time score status details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Toefl To Be Shortened By An Hour, Candidates To Get Real-time Score Status. Details Here

Changes in TOEFL : టోఫెల్ లో స్వల్ప మార్పులు; ఇకపై రెండు గంటలే ఈ పరీక్ష..

HT Telugu Desk HT Telugu
Apr 11, 2023 09:33 PM IST

Changes in TOEFL : ఇంగ్లీష్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ‘టోఫెల్ (TOEFL)’ పరీక్షా విధానంలో స్వల్ప మార్పులు చేశారు. ఇకపై ఈ పరీక్ష మూడు గంటలకు బదులుగా రెండు గంటలు మాత్రమే జరుగుతుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Changes in TOEFL : టోఫెల్ (TOEFL) ను ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ETS) నిర్వహిస్తుంటుంది. తాజాగా, ఈ పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు చేసినట్లు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ETS) ప్రకటించింది. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ (Test of English as a Foreign Language). ఇంగ్లీష్ లో ప్రావీణ్యాన్ని నిర్ధారించే ఈ పరీక్షకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Changes in TOEFL : జులై 26 నుంచి..

2023 జులై 26 నుంచి టోఫెల్ (TOEFL iBT) పరీక్ష రెండు గంటల పాటు మాత్రమే జరుగుతుందని ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ETS) తెలిపింది. ఇప్పటివరకు ఈ పరీక్ష 3 గంటల పాటు జరిగేది. అలాగే, ఈ పరీక్ష రాసే విద్యార్థులకు రియల్ టైమ్ స్కోర్ స్టేటస్ కూడా తెలియజేయనున్నట్లు వెల్లడించింది. గతంలో అవలంబించిన ‘ఇండిపెండెంట్ రైటింగ్ టాస్క్ (independent writing task)’ స్థానంలో ఇకపై ‘రైటింగ్ ఫర్ అకడమిక్ డిస్కషన్ టాస్క్ (writing for an academic discussion)’ ను ప్రవేశపెట్టనున్నారు. తద్వారా రీడింగ్ సెక్షన్ (reading section) తగ్గుతుంది. అలాగే, ఎలాంటి మార్కులు లేని టెస్ట్ క్వశ్చన్స్ (test questions) ను తొలగిస్తున్నారు. అలాగే, పరీక్ష రాయడం పూర్తి కాగానే అభ్యర్థులకు తమ స్కోర్స్ అధికారికంగా విడుదల అయ్యే తేదీ కూడా తెలిసిపోతుంది.

Changes in TOEFL : ఈజీ రిజిస్ట్రేషన్..

టోఫెల్ (TOEFL) రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా సులభతరం చేశారు. అక్కౌంట్ క్రియేట్ చేసుకోవడం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈజీగా, తొందరగా పూర్తి కానుంది. ఈ పరీక్షకు చెల్లించే ఫీజును ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, వినియోగం ఉన్న క్రెడిట్ కార్డ్ (Credit card), డెబిట్ కార్డ్ (Debit card) ల ద్వారానే చెల్లించడం సాధ్యమయ్యేది. ఇకపై స్థానికంగా చెలామణిలో ఉన్న క్రెడిట్ కార్డ్ (Credit card), డెబిట్ కార్డ్ (Debit card) ల ద్వారా, నెట్ బ్యాంకింగ్ (Net banking), వాలెట్స్ (wallet) ద్వారా కూడా ఫీజు చెల్లించవచ్చు. త్వరలో భారత్ లో ప్రత్యేకంగా ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్ ను కూడా ప్రారంభించబోతున్నట్లు ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీస్ (ETS) వెల్లడించింది.

WhatsApp channel