Titan shares : టైటాన్ షేర్లు 8 శాతం పైకి.. క్యూ 1లో బంపర్ సేల్స్-titan shares jump nearly 8 pc as sales nearly tripled in apr jun quarter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Titan Shares Jump Nearly 8 Pc As Sales Nearly Tripled In Apr-jun Quarter

Titan shares : టైటాన్ షేర్లు 8 శాతం పైకి.. క్యూ 1లో బంపర్ సేల్స్

HT Telugu Desk HT Telugu
Jul 07, 2022 11:09 AM IST

Titan shares jump: టైటాన్ షేర్స్ 8 శాతం లాభపడ్డాయి. తొలి త్రైమాసిక ఫలితాల్లో టైటాన్ సేల్స్ మూడింతలవడం విశేషం.

టైటాన్‌కు కలిసొచ్చిన జువెలరీ బిజినెస్ (ప్రతీకాత్మక చిత్రం)
టైటాన్‌కు కలిసొచ్చిన జువెలరీ బిజినెస్ (ప్రతీకాత్మక చిత్రం) (REUTERS)

న్యూఢిల్లీ, జూలై 7: టైటాన్ సేల్స్ గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో దాదాపు మూడు రెట్లు పెరిగాయని టాటా గ్రూప్ సంస్థ ఫలితాలు ప్రకటించడంతో గురువారం ఉదయం ట్రేడింగ్‌లో టైటాన్ షేర్లు దాదాపు 8 శాతం పెరిగాయి.

ట్రెండింగ్ వార్తలు

బీఎస్ఈలో స్థిరంగా ప్రారంభమైన తర్వాత షేరు 7.82 శాతం పెరిగి రూ. 2,170.95కి చేరుకుంది. ఎన్‌ఎస్‌ఈలో కంపెనీ షేర్లు 7.84 శాతం పెరిగి రూ. 2,171.60కి చేరాయి.

బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ రెండింటిలోనూ టాప్ గెయినర్‌గా నిలిచింది.

సెన్సెక్స్ 394.86 పాయింట్ల లాభంతో 54,145.83 వద్ద, నిఫ్టీ 123.90 పాయింట్ల లాభంతో 16,113.70 వద్ద ట్రేడవుతున్నాయి.

‘కంపెనీ నెట్‌వర్క్ విస్తరణ, క్యాంపెయిన్ Q1 FY23 అంతటా మంచి ఫలితాలను ఇచ్చాయి. ఇది గత మూడేళ్లలో మెరుగైన క్యూ1’ అని టైటాన్ తన త్రైమాసిక అప్‌డేట్స్‌లో పేర్కొంది. Q1 FY23లో సేల్స్ 205 శాతం పెరిగినట్టు టైటాన్ తెలిపింది.

ఆభరణాల విభాగం దాని ఆదాయంలో 85 శాతం దోహదపడుతుండగా, 207 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో 19 కొత్త స్టోర్‌లను ప్రారంభించడంతో, మొత్తం స్టోర్ల సంఖ్య 463కి చేరుకుంది.

‘2 సంవత్సరాల కోవిడ్ ప్రేరిత లాక్‌డౌన్‌ల తర్వాత మే నెలలో అక్షయ తృతీయ శుభ సందర్భంగా బలమైన అమ్మకాలతో ఎఫ్‌వై 23కి జువెలరీ డివిజన్ మంచి ప్రారంభాన్ని సాధించింది..’ అని టైటాన్ వెల్లడించింది.

IPL_Entry_Point