Mumbai crime news : రైల్వే స్టేషన్​లో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని అపహరించి.. రేప్​ చేసి!-three year old raped at railway station rag picker arrested
Telugu News  /  National International  /  Three Year Old Raped At Railway Station, Rag Picker Arrested
రైల్వే స్టేషన్​లో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని అపహరించి.. రేప్​ చేసి!
రైల్వే స్టేషన్​లో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని అపహరించి.. రేప్​ చేసి!

Mumbai crime news : రైల్వే స్టేషన్​లో నిద్రిస్తున్న మూడేళ్ల చిన్నారిని అపహరించి.. రేప్​ చేసి!

05 March 2023, 21:30 ISTSharath Chitturi
05 March 2023, 21:30 IST

Panvel crime news : మూడేళ్ల చిన్నారిని రైల్వే ప్లాట్​ఫార్మ్​ మీద పడుకోబెట్టి.. బాత్​రూమ్​కు వెళ్లింది ఆ తల్లి. ఇదే అదనుగా భావించిన ఓ కిరాతకుడు.. ఆ చిన్నారిని అపహరించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నవీ ముంబైలో చోటుచేసుకుంది.

Mumbai crime news : నవీ ముంబైలో దారుణం జరిగింది. రైల్వే స్టేషన్​లో చెత్త ఏరుకునే ఓ వ్యక్తి.. ప్లాట్​ఫార్మ్​ మీద నిద్రిస్తున్న ఓ మూడేళ్ల చిన్నారిని అపహరించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఇదీ జరిగింది..

జల్గావ్​లో నివాసముంటున్న ఓ మహిళ.. తన మూడేళ్ల కూతురిని తీసుకుని బుధవారం రైలు ఎక్కింది. అదే రోజు రాత్రి పాన్వెల్​ రైల్వే స్టేషన్​లో రైలు దిగింది. అక్కడి నుంచి మరో రైలు ఎక్కి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. కాగా.. ఆ రోజు రాత్రి ఆ రైల్వే స్టేషన్​ ప్లాట్​ఫార్మ్​ మీదే తన కూతురితో పాటు పడుకుండిపోయింది ఆ మహిళ.

Panvel crime news : కొంత సేపటి తర్వాత నిద్ర లేచిన ఆ తల్లి.. బాత్​రూమ్​ కోసం వెళ్లింది. తిరిగి వచ్చేసరికి.. 3ఏళ్ల బిడ్డ కనిపించకుండా పోయింది! తల్లి చాలా భయపడింది. సమీపంలోని పాన్వెల్​ గవర్న్​మెంట్​ రైల్వే పోలీస్​లకు ఫిర్యాదు చేసింది. తన బిడ్డ కనిపించడం లేదని, తనకు సాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కొంతసేపటికి.. పాన్వెల్​ రైల్వే స్టేషన్​కు పశ్చిమ ప్రాంతంలో.. స్పృహ కోల్పోయి పడి ఉన్న చిన్నారిని పోలీసులు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగినట్టు అనుమానించారు. ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరవైపు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని, నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.

Child raped in Panvel : ఈ క్రమంలోనే ప్లాట్​ఫార్మ్​ మీద ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. నిందితుడు దొరికిపోయాడు! ఆ రాత్రి.. తల్లి బాత్​రూమ్​కు వెళ్లగా.. కొన్ని క్షణాల తర్వాత ఓ వ్యక్తి అక్కడికి వెళ్లాడు. ఎవరూ లేరు, ఎవరూ చూడటం లేదనుకుని ఆ చిన్న బిడ్డను అపహరించాడు. అనంతరం రైల్వే స్టేషన్​కు పశ్చిమ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా పోలీసులు గురువారం సాయంత్రానికే నిందితుడిని పట్టుకున్నారు. అతని పేరు ముకేశ్​ కుమార్​ బాబు. వయస్సు 30ఏళ్ల. రైల్వే స్టేషన్​లలో చెత్త ఏరుకుంటూ ఉంటాడు. సియాన్​- పాన్వెల్​ హైవేకు చెందిన కలంబోలి ఫ్లైఓవర్​ కింద జీవిస్తూ ఉంటాడు. కాగా.. అతడిని జుయ్​నగర్​ రైల్వే స్టేషన్​ పరిధిలో పోలీసులు అరెస్ట్​ చేశారు.

కుక్కలపై అత్యాచారం..!

Man raped dog : దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచారం ఘటనలు రోజూ వార్తల్లో వినిపిస్తూనే ఉంటున్నాయి. అయితే.. దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలు కూడా రేపన్​కు గురవుతున్నాయి! గత కొన్ని రోజుల వ్యవధిలో రెండు వీధి శునకాలపై అత్యాచారం జరిగింది. డ్రగ్స్​కు బానిసైన ఓ వ్యక్తి.. ఏం చేస్తున్నాడో కూడా తెలియని స్థితిలో శునకంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.