Employees in layoff danger: ‘లే ఆఫ్’ టైమ్ లో ఏ ఉద్యోగులకు ఎక్కువ రిస్కో తెలుసా?-three types of employees who are most at risk during layoffs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Three Types Of Employees Who Are Most At-risk During Layoffs

Employees in layoff danger: ‘లే ఆఫ్’ టైమ్ లో ఏ ఉద్యోగులకు ఎక్కువ రిస్కో తెలుసా?

Sudarshan Vaddanam HT Telugu
Jan 26, 2023 10:48 PM IST

అన్ని అంతర్జాతీయ కంపెనీల్లో లే ఆఫ్స్ (lay offs) సీజన్ నడుస్తోంది. అన్ని మేజర్ టెక్ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన (lay offs) పలుకుతున్నాయి. ఈ లే ఆఫ్స్ (lay offs) లో ఏ ఉద్యోగులు ఎక్కువ రిస్క్ లో ఉన్నారో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆమెజాన్, ఫేస్బుక్, ట్విటర్, మెటా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, విప్రో, సేల్స్ ఫోర్స్, ఎస్ఏపీ ..ఇలా అన్ని ప్రముఖ టెక్, సాఫ్ట్వేర్, ఈ కామర్స్ సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన (lay offs) పలుకుతున్నాయి. అయితే, ఈ లే ఆఫ్ (lay offs) సీజన్ లో ఏ తరహా ఉద్యోగులు ఎక్కువ డేంజర్లో ఉన్నారో మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ (Former HR VP of Microsoft) క్రిస్ విలియమ్స్ వివరిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

High risk divisions in lay off season: ఈ మూడు విభాగాలు రిస్కీ

మైక్రోసాఫ్ట్ హెచ్ ఆర్ మాజీ వైస్ ప్రెసిడెంట్ (Former HR VP of Microsoft) క్రిస్ విలియమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు తరహాల ఉద్యోగ విధుల్లో ఉన్నవారు ప్రధానంగా ఇలాంటి లే ఆఫ్ (lay offs) సీజన్లలో మొదట ఉద్యోగాలు కోల్పోతారు. ఈవెంట్ ప్లానింగ్ టీమ్ (event planning team) ల్లో ఉన్న ఉద్యోగులు, న్యూ ఇనిషియేటివ్స్ టీమ్స్ (new initiatives team) లో ఉన్న ఉద్యోగులు, కంపెనీ కాంట్రాక్ట్ ఉద్యోగులు (contract workers) మొదట ఉద్యోగాలు కోల్పోతారు (lay offs).

contract workers: మొదటి వేటు కాంట్రాక్ట్ ఉద్యోగులపై

వీరిలో కూడా ఎక్కువ రిస్క్ కాంట్రాక్ట్ ఉద్యోగులకే (contract workers). సంస్థలు లే ఆఫ్స్ (lay offs) గురించి ఆలోచించినప్పుడు మొదటి వేటు పడేది కాంట్రాక్ట్ ఉద్యోగుల (contract workers) పైననే. మొదట వారిని తొలగించడానికే సంస్థలు ప్రయత్నిస్తాయి. ఇలా అవసరమైనప్పుడు తొలగించే అవకాశం ఉన్నందువల్లనే కంపెనీలు కాంట్రాక్ట్ ఉద్యోగులను (contract workers) హైర్ చేసుకుంటాయి.

risky categories: తరువాతి విభాగాలు ఇవే..

ఆ తరువాత ఈవెంట్ ప్లానింగ్ (event planning), న్యూ ఇనిషియేటివ్స్ (new initiatives team) విభాగాల ఉద్యోగులపై వేటుకు (lay offs) అవకాశముంది. ఆదాయం, లాభాలు తగ్గి, పొదుపు చర్యలు ప్రారంభించాలని సంస్థలు నిర్ణయించుకున్నప్పుడు.. కాంట్రాక్ట్ ఉద్యోగుల తరువాత ఈవెంట్ ప్లానింగ్ (event planning), న్యూ ఇనిషియేటివ్స్ (new initiatives team) విభాగాల ఉద్యోగులను తొలగించడానికి (lay offs) కంపెనీలు ప్రయత్నిస్తాయి. లగ్జరీ కార్యకలాపాల ఖర్చును తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంటాయి.

Safe category employees in Lay off season: ఈ ఉద్యోగులు సేఫ్

సంస్థ లాభాలను ఆర్జిస్తున్న (profit making) విభాగాల్లో ఉన్న ఉద్యోగులు సాధారణంగా సేఫ్ (Safe category employees) అని భావించవచ్చు. లాభాలు ఆర్జిస్తున్న (profit making) కార్యకలాపాల విషయంలో మేనేజ్ మెంట్లు సాధారణంగా జోక్యం చేసుకోవు. అలాగే, మానవ వనరులు (human resources), ఫైనాన్స్ (finance) విభాగాల వారిపై కూడా లే ఆఫ్ ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకంటే, ఈ ఫైరింగ్ ప్రాసెస్ లో హెచ్ఆర్ (human resources), ఫైనాన్స్ (finance) విభాగాలది కీలక పాత్ర.

IPL_Entry_Point

టాపిక్