Threat calls to Gadkari: 10 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా; గడ్కరీకి బెదిరింపు
Threat calls to Gadkari: బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో, నాగపూర్ లోని ఆయన ఇల్లు, కార్యాలయాల వద్ద సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు.
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో, నాగపూర్ లోని ఆయన ఇల్లు, కార్యాలయాల వద్ద సెక్యూరిటీని పెంచారు.
Threat calls to Gadkari: 10 కోట్లు ఇవ్వకపోతే..
బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉన్న నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఆఫీస్ కు జయేశ్ పూజారి అనే వ్యక్తి సోమవారం ఉదయం ఫోన్ చేసి రూ. 10 కోట్లు ఇవ్వనట్లైతే, నితిన్ గడ్కరీని హత్య చేస్తామని హెచ్చరించాడు. తాను దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడినని చెప్పుకున్నాడు. తన పేరు జయేశ్ పూజారీ అలియాస్ జయేశ్ కాంతి అని వివరించాడు. ఉదయం రెండు సార్లు, మధ్యాహ్నం ఒకసారి ఇలా బెదిరింపు కాల్స్ రావడంతో అప్రమత్తమైన గడ్కరీ (Nitin Gadkari) కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో, పోలీసులు నాగపూర్ లోని గడ్కరీ ఇల్లు, ఆఫీస్ ల వద్ద భద్రతను పెంచారు.
Threat calls to Gadkari: రూ. 100 కోట్లు ఇవ్వకపోతే..
ఈ సంవత్సరం జనవరిలో కూడా ఇదే వ్యక్తి నాగపూర్ లోని గడ్కరీ (Nitin Gadkari) ఆఫీస్ కు ఫోన్ చేసి, రూ. 100 కోట్లు ఇవ్వకపోతే, గడ్కరీని హత్య చేస్తానని బెదిరించాడు. అప్పుడు కూడా ఒక రోజంతా వరుసగా కాల్స్ చేయడంతో గడ్కరీ వ్యక్తిగత కార్యాలయ సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడైన పూజారీ కి ఒక హత్య కేసులో మరణ శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన కర్నాటకలోని బెలగావిలో ఉన్న జైళ్లో ఉన్నాడు.