Tata Nano Solar Car: ఇది టాటా నానో సోలార్ కారు: రూ.30 ఖర్చుతో 100 కిలోమీటర్లు-this tata nano runs on solar power cost 30 rupees for 100 kilometer ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  This Tata Nano Runs On Solar Power Cost 30 Rupees For 100 Kilometer

Tata Nano Solar Car: ఇది టాటా నానో సోలార్ కారు: రూ.30 ఖర్చుతో 100 కిలోమీటర్లు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 20, 2023 12:31 PM IST

Tata Nano Solar Car: టాటా నానో కారును సోలార్ కారుగా మార్చారు ఓ వ్యాపారి. సౌరశక్తితోనే ఈ కారు నడుస్తోంది. పూర్తి వివరాలివే..

Tata Nano Solar Car: ఇది టాటా నానోను సోలార్ కారు (Photo: HT_Auto)
Tata Nano Solar Car: ఇది టాటా నానోను సోలార్ కారు (Photo: HT_Auto)

Tata Nano Solar Car: పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తప్పించుకునేందుకు ప్రజలు క్రమంగా ఎలక్ట్రిక్ వాహనాలను కొంటుకున్నారు. అయితే పశ్చిమ బెంగాల్‍(West Bengal)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం తన కారును సోలార్ కారు(Solar Car)గా మార్చేసుకున్నారు. సౌరశక్తితో నడిచేలా తయారు చేసుకున్నారు. తన పాత టాటా నానో (Tata Nano) కారును సోలార్ కారులా తీర్చిదిద్దుకున్నారు. పశ్చిమ బెంగాల్‍లోని బంకుడా (Bankura) జిల్లాకు చెందిన మనోజిత్ మండల్ (Manojit Mandal) అనే వ్యాపారి ఈ ప్రయోగం చేశారు. సోలార్ పవర్‌తో నడిచేలా టాటా నానో కారును తీర్చిదిద్దారు. దీనికి ఇంజిన్ కూడా లేదు. కారు రూఫ్‍పై సొలార్ ప్యానెల్స్ ఉన్నాయి. ఇది సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

Tata Nano Solar Car: కార్లకు సోలార్ పవర్ అనేది కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. లిథియమ్ అయాన్ బ్యాటరీలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా కొన్ని కార్లకు సొలార్ సదుపాయం ఉంటుంది. అయితే మనోజిత్ మాత్రం సోలార్ శక్తితోనే నడిచేలా ఈ నానో కారును తయారు చేసుకున్నారు.

రూ.30తో 100 కిలోమీటర్లు

Tata Nano Solar Car: తన టాటా నానో సోలార్డ్ పవర్డ్ కారుతో బెంగాల్‍లోని బంకురా వీధుల్లో మనోజిత్ మండల్ ప్రయాణిస్తున్నారు. ఈ కారుకు ఇంజిన్ ఉండదు, పెట్రోల్ అవసరం లేదు. బ్యాటరీలే ఉంటాయి. అందుకే ఎలక్ట్రిక్ కారులా చాలా నిశ్శబ్దంగా ఈ సోలార్ కారు ప్రయాణిస్తుంది. రూ.30 ఖర్చుతో ఈ సోలార్ కారులో 100 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని మనోజిత్ చెప్పారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది.

అందుకే తయారు చేశా..

Tata Nano Solar Car: ప్రభుత్వం నుంచి తనకు అనుమతి లభించినా.. ఈ సోలార్ నానో కారును తయారు చేసేందుకు పెద్దగా మద్దతు దక్కలేదని మనోజిత్ తెలిపారు. అయితే తనకు చిన్నతనం నుంచి ఏవైనా ప్రయోగాలు చేయాలంటే చాలా ఇష్టమని, అందుకే ఎలాగైనా ఈ టాటా నానో సోలార్ కారును తయారు చేయాలనుకున్నానని అన్నారు. ఎట్టకేలకు తయారీని పూర్తి చేసినట్టు తెలిపారు. ఈ టాటా నానో సోలార్ కారు విజయవంతంగా నడుస్తోంది.

Tata Nano; 2008లో రూ.1లక్ష (ఎక్స్-షోరూమ్) ధరతో నానో కారును టాటా మోటార్స్ లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా టాటా నానో మోడల్ సంచలనం సృష్టించింది. ఈ స్మాలెస్ట్ కారు ఉత్పత్తి, సేల్‍ను 2018లో టాటా నిలిపివేసింది. ఇండియాలోనే సైజ్ పరంగా ఇది అత్యంత చిన్నకారులా ఉంది. ట్విన్ సిలిండర్ 624cc ఇంజిన్ ఈ కారులో ఉంటుంది. ఇది 38ps గరిష్ట పవర్‌ను జనరేట్ చేస్తుంది.

IPL_Entry_Point