అమానుషం! టార్గెట్స్​ రీచ్​ అవ్వలేదని ఉద్యోగుల న్యూడ్​ ఫొటోలను షేర్​ చేసిన కంపెనీ..-this japanese company circulated nude pictures of employees over poor performance ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అమానుషం! టార్గెట్స్​ రీచ్​ అవ్వలేదని ఉద్యోగుల న్యూడ్​ ఫొటోలను షేర్​ చేసిన కంపెనీ..

అమానుషం! టార్గెట్స్​ రీచ్​ అవ్వలేదని ఉద్యోగుల న్యూడ్​ ఫొటోలను షేర్​ చేసిన కంపెనీ..

Sharath Chitturi HT Telugu

జపాన్​లోని విద్యుత్ రంగానికి చెందిన నియో కార్పొరేషన్ సంస్థపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పని ప్రదేశంలో ఉద్యోగులను నగ్న ఫోటోలు తీసి ఫార్వర్డ్ చేయాలని కంపెనీ బలవంతం చేసిందని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఇంకా అనేక అమానవీయ ఆరోపణలను ఇప్పుడు ఈ కంపెనీ ఎదుర్కొంటోంది.

జపాన్​ కంపెనీ అమానవీయ చర్యలు.. (Photo- MInt)

జపాన్‌లోని ఒసాకా కేంద్రంగా పనిచేస్తున్న నియో కార్పొరేషన్ అనే కంపెనీ ఉద్యోగులను శిక్షించడానికి అత్యంత దారుణమైన మార్గాన్ని ఎంచుకుంది. సేల్స్ టార్గెట్లను చేరుకోలేని ఉద్యోగులతో బలవంతంగా నగ్న చిత్రాలు తీయించి షేర్​ చేయడమే కాదు, కంపెనీ బాస్ వారిని శారీరకంగా కూడా వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఇదీ జరిగింది..

నియో కార్పొరేషన్ అనే సంస్థ విద్యుత్, ఇంధన ఆదా పరికరాల అమ్మకాలు, వాటిని ఇన్‌స్టాల్ చేసే రంగంలో పనిచేస్తుంది. ప్రస్తుతం జపాన్ వ్యాప్తంగా దీనికి తొమ్మిది శాఖలు ఉన్నాయి.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం.. ఈ షాకింగ్ ఘటన ఈ ఏడాది మార్చ్​లో ఐదుగురు మాజీ ఉద్యోగులు దాఖలు చేసిన వ్యాజ్యం ద్వారా వెలుగులోకి వచ్చింది. అందులో అధికారంలో ఉన్న వారిచే మాటల దుర్భాష, వేధింపులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. దాఖలు చేసిన పిటిషన్‌లో ఒక వ్యక్తి మాట్లాడుతూ.. ఒక రోజులో సేల్ చేయడంలో విఫలమైతే సేల్స్ మేనేజర్ ఉద్యోగులను బలవంతంగా నగ్న చిత్రాలు తీయమని ఒత్తిడి చేసేవాడని పేర్కొన్నాడు. ఈ శిక్ష అక్కడితో ఆగలేదు, ఈ చిత్రాలను ఇతర ఉద్యోగులతో పంచుకోవడమే కాకుండా, టార్గెట్ చేసిన ఉద్యోగికి "ఇది షేర్ చేశాము," అనే సందేశం కూడా పంపేవారు.

ఆ ఉద్యోగి తన ఉన్నతాధికారి తరచుగా తన ప్రైవేట్ భాగాలను పట్టుకుని అవమానకరంగా శిక్షించేవాడని కూడా ఆరోపించాడు.

"నా ఉన్నతాధికారి తాను ఎక్కువ బలాన్ని ఉపయోగించడం లేదని చెప్పుకొచ్చాడు. కానీ అది చాలా బాధాకరంగా ఉంది, నేను మాట్లాడలేకపోయాను. ఇలాంటివి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి," అని అతను చెప్పాడు. బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించినప్పుడు, అతను నవ్వి, "అందరూ దీనిని దాటిన వారే," అని వ్యాఖ్యానించాడు. ఈ శిక్షల కారణంగా తనకు అడ్జెస్టెబుల్​ సిండ్రోమ్​, డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ఆ ఉద్యోగి పేర్కొన్నాడు.

ఈ ఆరోపణలు నగ్న చిత్రాలు తీయడానికే పరిమితం కాలేదు. అదనపు పని గంటలు (ఓవర్‌టైమ్), మాటల దుర్భాష కూడా సర్వసాధారణం అయ్యాయని నివేదించడం జరిగింది. అధికారిక విందును దాటవేసినందుకు ఒక బ్రాంచ్ మేనేజర్‌ను కంపెనీ డైరెక్టర్ చెంపదెబ్బ కొట్టినట్లు ఆరోపణలున్నాయి. ఇతర ఆరోపణలలో సేల్స్ కమిషన్లు తగ్గించడం, జీతం నుంచి కంపెనీకి డబ్బు తిరిగి బదిలీ చేయమని ఉద్యోగులను అడగడం, ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించడం వంటివి ఉన్నాయి. కొన్ని జరిమానాలు ఏకంగా ఆరు మిలియన్ల యెన్‌లు (42,000 డాలర్ల) వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

చివరికి మార్చి 2025లో ఐదుగురు మాజీ ఉద్యోగులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. అన్యాయమైన వేతన కోతలు, కార్యాలయ వేధింపులకు గాను 19 మిలియన్ యెన్‌ల (132,000 డాలరలు) నష్టపరిహారం కోరారు. ప్రస్తుతానికి, కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది. ఏకపక్ష దృక్పథాల ఆధారంగా వాస్తవ దోషాలు ఉన్నాయని పేర్కొంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.