స్విస్ గ్రూప్ ఐక్యూఎయిర్ 2024 వార్షిక కాలుష్య నివేదిక ప్రకారం.. మేఘాలయలోని బైర్నిహాట్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య పట్టణంగా నిలిచింది. అయితే, భారతదేశ రాజధాని ఢిల్లీ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి కూడా బైర్నిహాట్ ను వరుసగా రెండవ సంవత్సరం భారతదేశంలో అత్యంత కలుషితమైన పట్టణ ప్రాంతంగా ప్రకటించింది, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఎక్యూఐ) 302 తో, దీనిని "చాలా పేలవమైన (very poor)" కేటగిరీలో ఉంచింది.
ఢిల్లీ తరచుగా అత్యంత కలుషితమైన నగరంగా భావించబడుతున్నప్పటికీ, ఇది రెండవ స్థానంలో ఉంది, తరువాత కజకిస్తాన్ లోని కరగండ మూడవ స్థానంలో ఉంది. భారతదేశంలోని పంజాబ్ లోని ముల్లాన్ పూర్ నాల్గవ స్థానంలో, పాకిస్తాన్ లోని లాహోర్ ఐదవ స్థానంలో ఉన్నాయి. పాకిస్థాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ ఆరో స్థానంలో, చాద్ లోని నజామెనా ఏడో స్థానంలో, భారత్ లోని ఉత్తరప్రదేశ్ లో ఉన్న లోని పట్టణం ఎనిమిదో స్థానంలో ఉన్నాయి. న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో, హర్యానాలోని ఫరీదాబాద్ 10వ స్థానంలో నిలిచాయి.
2024లో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల జాబితాలో పాకిస్థాన్ లోని ముల్తాన్ 11వ స్థానంలో, పెషావర్ 12వ స్థానంలో, ఫైసలాబాద్ 13వ స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ లోని సియాల్ కోట్ 14వ స్థానంలో ఉంది. హర్యానాలోని గురుగ్రామ్, రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ వరుసగా 15, 16 స్థానాల్లో నిలిచాయి. చైనాలోని హోతాన్ 17వ స్థానంలో నిలవగా, గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్), భివాడి (రాజస్థాన్) 18, 19 స్థానాల్లో నిలిచాయి. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ 20వ స్థానంలో నిలిచింది.
రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ 21వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ లోని నోయిడా 22వ స్థానంలో నిలిచాయి. పాకిస్థాన్ లోని పిండి భటియన్ 23వ స్థానంలో, బల్లాబ్ గఢ్ (హర్యానా), మండి గోవింద్ గఢ్ (పంజాబ్ ) వరుసగా 24, 25 స్థానాల్లో నిలిచాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 26వ స్థానంలో, హర్యానాలోని బహదూర్ గఢ్ 27వ స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ లోని శ్రీపూర్ 28వ స్థానంలో, పాకిస్థాన్ లోని చార్సద్దా 29వ స్థానంలో నిలిచాయి.
సంబంధిత కథనం