This Family Lost 6 Members In Bridge Tragedy: ఒకే కుటుంబంలోని ఆరుగురి మృతి-this gujarat family lost 6 members in bridge tragedy youngest was 3 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  This Gujarat Family Lost 6 Members In Bridge Tragedy, Youngest Was 3

This Family Lost 6 Members In Bridge Tragedy: ఒకే కుటుంబంలోని ఆరుగురి మృతి

HT Telugu Desk HT Telugu
Nov 01, 2022 10:52 PM IST

This Family Lost 6 Members In Bridge Tragedy: మోర్బి తీగల వంతెన ఆ కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చింది. సుమారు 140 మంది చనిపోయిన ఆ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ఆరుగురున్నారు. వారిలో ఒకరు మూడేళ్ల చిన్నారి.

మొర్బి వంతెన వద్ద ప్రమాద దృశ్యం
మొర్బి వంతెన వద్ద ప్రమాద దృశ్యం (AP)

This Family Lost 6 Members In Bridge Tragedy: గుజరాత్ లోని మొర్బిలో తీగల వంతెన ప్రమాదంలో మరణించిన సుమారు 140 మందిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురున్నారు. వారిలో మరో పక్షం రోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువతి, మూడేళ్ల బాలుడు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

This Family Lost 6 Members In Bridge Tragedy: సాయంత్రం ఆరు గంటల సమయంలో..

ఆ రోజు ఏం జరిగిందో మెహబూబ్ భాయి మీరా వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. తమ కుటుంబంలోని ఆరుగురు ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆ సస్పెన్షన్ బ్రిడ్జి వద్దకు వెళ్లారు. వారిలో ముగ్గురు పెద్ద వాళ్లు, ముగ్గురు చిన్న పిల్లలున్నారు. అందరికన్న చిన్న పిల్లవాడి వయస్సు మూడేళ్లు. మరో 15 రోజుల్లో పెళ్లి కావాల్సిన ఒక యువతి కూడా ఉంది. మెహబూబ్ దంపతులు కూడా అక్కడికి వెళ్లాల్సి ఉన్నా పెళ్లి షాపింగ్ పనుల వల్ల ఆగిపోయారు.

This Family Lost 6 Members In Bridge Tragedy: విపరీతంగా రద్దీ

తమ కుటుంబం అక్కడికి వెళ్లిన సమయంలో అక్కడ అప్పటికే రద్దీ విపరీతంగా ఉందని, బ్రిడ్జి పైకి వెళ్లడానికి ఎంట్రీ టికెట్ రూ. 17 అని, అప్పటికే సుమారు 400 టికెట్లను అమ్మేశారని మెహబూబ్ భాయి తెలిపారు. బ్రిడ్జిపైన కిక్కిరిసి ఉన్నారని, అయితే, కెపాసిటికి మించి ఉన్నారని, బ్రిడ్జిపైకి వెళ్లవద్దని చెప్పడానికి అక్కడ ఎవరూ లేరని వివరించారు. దాంతో, గుంపులు, గుంపులుగా వంతెన పైకి వెళ్లడంతో తీగలు తెగి వంతెన కుప్పకూలిందని వివరించారు.

This Family Lost 6 Members In Bridge Tragedy: అధికారుల అలసత్వం

ఆ సమయంలో అక్కడ నిర్వహణ అంటూ ఏమీ లేదని, ఘటన జరిగిన గంట తరువాత అంబులెన్స్ వచ్చిందని, అధికారులు తాపీగా రెండు గంటల తరువాత వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సమయానికి, సరిగ్గా స్పందించి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కావని, చాలా మందిని కాపాడడం సాధ్యమయ్యేదని వాపోయారు.

This Family Lost 6 Members In Bridge Tragedy: 125 మంది కెపాసిటీ..

బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఆ వంతెన సామర్ధ్యం 125 మాత్రమే. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో దానిపై 500 మంది ఉన్నారు. వంతెన నిర్వహణ కూడా సరిగ్గా లేదు. ప్రతీ సంవత్సరం కొన్ని నెలల పాటు ఆ వంతెనపై రాకపోకలను నిలిపేసి మరమ్మత్తు పనులు చేయల్సి ఉండగా, ఆ విషయం ఎవరూ పట్టించుకోలేదు.

WhatsApp channel