Naatu Naatu popular in Korea: దక్షిణ కొరియాలోనూ దుమ్ము రేపుతున్న ‘నాటు.. నాటు’-this foreign minister loves hindi films says naatu naatu very popular in his country ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Naatu Naatu Popular In Korea: దక్షిణ కొరియాలోనూ దుమ్ము రేపుతున్న ‘నాటు.. నాటు’

Naatu Naatu popular in Korea: దక్షిణ కొరియాలోనూ దుమ్ము రేపుతున్న ‘నాటు.. నాటు’

HT Telugu Desk HT Telugu

Naatu Naatu popular in Korea: ఆస్కార్ సాధించిన తెలుగు ‘నాటు నాటు (Naatu Naatu)’ పాట దక్షిణ కొరియా (South Korea) లోనూ దుమ్ము రేపుతోందట. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రే స్వయంగా చెప్పారు.

దక్షిణ కొరియా విదేశాంగ మంత్రి పార్క్ జిన్

Naatu Naatu popular in Korea: ఘన విజయం సాధించిన తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు (Naatu Naatu)’ పాటు దేశ విదేశాల్లోని మ్యూజిక్, డ్యాన్స్ లవర్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఇటు ప్రపంచ ప్రజల హృదయాలను అటు ఆస్కార్ అవార్డును కొల్లగొట్టిందీ ‘నాటు’ పాట.

Naatu Naatu popular in Korea: ఆర్ ఆర్ ఆర్ సినిమా అద్భుతంగా ఉంది

దక్షిణ కొరియా (South Korea) విదేశాంగ మంత్రి పార్క్ జిన్ (Park Jin) రెండు రోజుల అధికారిక పర్యటనకు గానూ భారత్ కు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్ ఆర్ ఆర్ సినిమాను తాను చూశానని, తనకు ఆ సినిమా, సినిమా కథ, డ్యాన్స్ అన్నీ బాగా నచ్చాయని Park Jin ప్రశంసించారు. నాటు నాటు (Naatu Naatu) పాట తమ దేశంలో చాలా పాపులర్ అని, తమ దేశ యువత ఆ పాటకు, ఆ డ్యాన్స్ కు ఫిదా అయి పోయారని వ్యాఖ్యానించారు. తాను బాలీవుడ్ సినిమాలకు (Bollywood movies) పెద్ద ఫ్యాన్ ను అన్నారు. ‘ నాటు నాటు పాట మా దేశంలో చాలా పాపులర్. నేను కూడా ఆర్ఆర్ఆర్ ‘రైజ్.. రోర్.. రివోల్ట్ (Rise, Roar and Revolt RRR) సినిమా చూశాను. ఆ సినిమా అద్భుతంగా ఉంది. సినిమా కథ కూడా బావుంది. భారతీయులు, వారి చరిత్ర గురించిన అసాధారణ కథ అది’’ అని పార్క్ జిన్ (Park Jin) వ్యాఖ్యానించారు.

Naatu Naatu popular in Korea: బాలీవుడ్ సినిమాలకు ఫ్యాన్ ను..

తాను బాలీవుడ్ సినిమాలకు (Bollywood movies) పెద్ద ఫ్యాన్ ను అని దక్షిణ కొరియా (South Korea) విదేశాంగమంత్రి Park Jin వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ తో పాటు తనకు షారూఖ్ ఖాన్ నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ (Chennai Express), ఆమీర్ ఖాన్ సినిమా త్రీ ఈడియట్స్ (3 Idiots) కూడా చాలా నచ్చాయన్నారు. ఢిల్లీలోని కొరియా ఎంబసీ సిబ్బంది నాటు నాటు (Naatu Naatu) పాటకు డ్యాన్స్ పెర్ఫార్మ్ చేయడం తనకు సంతోషం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా కాసేపు పార్క్ జిన్ (Park Jin) హిందీలో మాట్లాడారు. ‘‘నమస్తే, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నా పేరు పార్క్ జిన్. దక్షిణ కొరియావిదేశాంగ మంత్రిని’’ అని ఆయన హిందీలో అన్నారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.