Thiruvabharanam procession: శబరిమలకు తిరువాభరణం యాత్ర ప్రారంభం-thiruvabharanam procession sets off for sabarimala ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Thiruvabharanam Procession Sets Off For Sabarimala

Thiruvabharanam procession: శబరిమలకు తిరువాభరణం యాత్ర ప్రారంభం

HT Telugu Desk HT Telugu
Jan 12, 2023 06:18 PM IST

Thiruvabharanam procession: శబరిమలలోని అయ్యప్ప స్వామికి పవిత్ర ఆభరణాలను తీసుకువచ్చే యాత్ర గురువారం ప్రారంభమైంది. పండలం లోని దేవాలయం నుంచి ఈ యాత్ర మొదలైంది.

శబమలలో అయ్యప్ప భక్తులు
శబమలలో అయ్యప్ప భక్తులు (PTI)

Thiruvabharanam procession: భక్త కోటి శరణు ఘోష మధ్య తిరువాభరణ యాత్ర గురువారం ప్రారంభమైంది. పండలంలోని దేవాలయం నుంచి ఈ పవిత్ర ఆభరణాలను శాస్త్రోక్తంగా, ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఆభరణాలను పవిత్ర మకర విలక్కు సందర్భంగా జనవరి 14న అయ్యప్ప స్వామికి అలంకరిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

Thiruvabharanam procession: మూడు రోజులు, కాలి నడకన..

ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రతినిధులు పండలం నుంచి వచ్చిన ఈ ఆభరణాలను స్వీకరించి, భక్తుల దర్శనార్థం కొంత సేపు శాస్త ఆలయంలో పెడ్తారు. ఈ ఆభరణాలను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని, పూజలు చేస్తారు. సంప్రదాయంగా చేసే పూజాదికాల అనంతరం, భక్తుల శరణు ఘోష మధ్య ఈ పవిత్ర ఆభరణాలను చెక్క బాక్స్ ల్లో పెట్టి శబరిమల తీసుకు వెళ్తారు. గత ఆరు దశాబ్దాలుగా నియమ నిష్టలతో ఈ క్రతువును నిర్వహిస్తున్న కులథినాల్ గంగాధరన్ పిళ్లై ఆధ్వర్యంలో ఈ ఆభరణాలను తలపై పెట్టుకుని మూడు రోజుల పాటు నడిచి జనవరి 14 సాయంత్రానికి శబరిమల చేరుకుంటారు. ఈ ఊరేగింపునకు పండలం రాజ కుటుంబ ప్రతినిధి కత్తి చేత పట్టుకుని రక్షణ కల్పిస్తారు. అయితే, ఈ సంవత్సరం పండలం రాజ కుటుంబంలో మరణం సంభవించడం వల్ల రాజకుటుంబ ప్రతినిధి ఈ ఊరేగింపులో పాల్గొనడం లేదు. ఈ పవిత్ర ఊరేగింపునకు కేరళ ప్రభుత్వం భారీ భద్రతను కల్పిస్తుంది. ఈ ఊరేగింపుతో పాటు పెద్ధ ఎత్తున భక్తులు ఇరుముడితో నడుస్తారు.

Thiruvabharanam procession: అయ్యప్ప స్వామికి ఆభరణాల అలంకరణ

ఆ పవిత్ర ఆభరణాలను జనవరి 14న దీపారాధనకు ముందు, స్వామి వారికి తంత్రి కందరపు రాజీవరరు అలంకరిస్తారు. అయ్యప్ప స్వామికి ఈ పవిత్ర ఆభరణాలను అలంకరించడంలో తంత్రి కందరపు రాజీవరరుకు మెల్సాంతి సహకరిస్తారు.

IPL_Entry_Point

టాపిక్