'మ్యాథ్స్​లో తోపు' అని మీ ఫీలింగ్​ ఆ? ఈ పజిల్​ని 15 సెకన్లలో సాల్వ్​ చేయగలరా?-think you are a maths genius solve this puzzle in 15 seconds to prove it ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'మ్యాథ్స్​లో తోపు' అని మీ ఫీలింగ్​ ఆ? ఈ పజిల్​ని 15 సెకన్లలో సాల్వ్​ చేయగలరా?

'మ్యాథ్స్​లో తోపు' అని మీ ఫీలింగ్​ ఆ? ఈ పజిల్​ని 15 సెకన్లలో సాల్వ్​ చేయగలరా?

Sharath Chitturi HT Telugu

ఎక్స్​లో షేర్ చేసిన ఒక మ్యాథ్స్ బ్రెయిన్ టీజర్ ఇప్పుడు వైరల్​గా మారింది. మ్యాథ్స్​పై ఆసక్తి ఉన్న వారు ఈ పజిల్​ని పూర్తి చేసేందుకు ఇష్టపడుతున్నారు. మీరూ ఒక లుక్కేయండి మరి..

ఈ మ్యాథ్స్​ పజిల్​ని మీరు సాల్వ్​ చేయగలరా? (X/@brainyquiz_)

చాలా మందిగి మ్యాథ్స్​ అంటే భయం! చిన్న లెక్కలలు కనిపిస్తేనే భయపడిపోతుంటారు. కానీ ఇంకొందరు మాత్రం మ్యాథ్స్​ని, అది విసిరే సవాళ్లను ప్రేమిస్తారు. వీరిలో మీరు కూడా ఉన్నారా? ‘నేను మ్యాథ్స్​లో తోపు’ అని మీ ఫీలింగ్​ ఆ? అయితే ఈ కింద ఉన్న పజిల్​ని కేవలం 15 సెకన్లలో సాల్వ్​ చేయగలరా?

ఈ బ్రెయిన్​ టీజర్​ పజిల్​ని పరిష్కరించగలరా?

మ్యాథ్స్ బ్రెయిన్ టీజర్లు చాలా కాలంగా ఆసక్తిగల వ్యక్తుల మనస్సులను ఆకర్షిస్తున్నాయి. చిన్న చిన్న వాటి నుంచి పెద్ద ట్రిక్కీ, మ్యాథ్స్​ పజిల్స్​ వరకు అనేక బ్రెయిన్​ టీజర్లు మెదడను పరీక్షిస్తాయి. ఈ తరహా మ్యాథ్స్​ పజిల్స్​ ఇటీవలి కాలంలో సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్నాయి. మీరు గణిత చిక్కుముడులను పరిష్కరించడాన్ని ఆస్వాదించే వ్యక్తి అయితే, ఆన్​లైన్​లో ప్రస్తుత చక్కర్లు కొడుతున్న ఒక కొత్త సవాలు మీద ఫోకస్​ చేయాల్సిందే!

ఎక్స్​లో బ్రెయినీ క్విజ్ అనే అకౌంట్​ నుంచి షేర్ చేసిన బ్రెయిన్ టీజర్ పజిల్ ఔత్సాహికుల్లో ఆదరణ పొందుతోంది.

పజిల్​ ఇలా ఉంది :

"123 = 26, 223 = 46, 323 = 66, 345 = ?"

పజిల్ ఇక్కడ చూడండి:

ఈ నమూనా మొదటి చూపులో సంఖ్యాపరంగా కనిపిస్తుంది, కానీ చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ సంఖ్యల పరివర్తన వెనుక ఉన్న లాజిక్​ అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కొందరు తీసివేత లేదా అంకెల మానిప్యులేషన్ ద్వారా గణిత సంబంధాన్ని కనుగొనడానికి ప్రయత్నించగా, మరికొందరు సమాధానం దాచిన క్రమం లేదా కోడ్​లో ఉందని ఊహించారు.

మీ సమాధానం రాకపోతే పైన ఇచ్చిన ట్వీట్​ క్లిక్​ చేసి చూడండి. పోస్ట్​ కింద కామెంట్స్​లో చాలా మంది తమకు వచ్చిన సమాధానాలను వెల్లడించారు. మీరు కూడా అదే అనుకున్నారో లేదో చెక్​ చేయండి.

ఫేస్​బుక్ నుంచి మరో టీజర్ వైరల్..

ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన టీజర్ ఇదొక్కటే కాదు. మినియన్ కోట్స్ అనే ఫేస్​బుక్​ పేజీ గతంలో ఒక పజిల్​ని షేర్​ చేసింది. ఇది వినియోగదారులను కూడా ఆశ్చర్యపరిచింది.

"మ్యాథ్స్​ పజిల్: 10 + 10 = 00, 12 + 13 = 36, 13 + 13 = 39, 15 + 14 = ?? - మీరు దీన్ని పరిష్కరించగలరా?"

సింపుల్​గా కనిపించే ఈక్వేషన్స్ నిజానికి అస్సలు సింపుల్​ కాదు! సోషల్ మీడియా యూజర్లు కామెంట్స్ సెక్షన్​లో లాజిక్ గురించి చర్చించుకుంటున్నారు.

ఈ పజిల్స్ ఎందుకు అంత ప్రాచుర్యం పొందుతున్నాయి?

కొత్త కొత్త మ్యాథ్స్ బ్రెయిన్ టీజర్లు ఇంటర్నెట్​లో కనిపిస్తూనే ఉన్నాయి. అపరిష్కృతంగా అనిపించిన వాటిని పరిష్కరించే థ్రిల్ కావచ్చు, లేదా అందరికంటే ముందు ఒక పజిల్​ని పూర్తి చేయగలిగాను అన్న తృప్తి కావచ్చు.. ఈ తరహా పజిల్స్​పై ఆసక్తి పెరుగుతోంది. ఈ టీజర్లు క్రిటికల్ థింకింగ్​ని ప్రేరేపించడమే కాకుండా రోజువారీ ‘మైండ్​లెస్​’ స్క్రోలింగ్​ నుంచి కొంతసేపు దృష్టి మరల్చడాన్ని కూడా ఉపయోగపడతాయి.

మీరు దానిని ఫ్లాష్​లో పరిష్కరించినా లేదా దానిని గుర్తించడానికి గంటలు గడిపినా, ఒక విషయం ఖచ్చితంగా ఉంది - మ్యాథ్య్​ పజిల్స్ పట్ల వ్యామోహం మొదలైతే, ఇప్పటిలో పోదు!

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.