UP crime news : దొంగతనానికి వచ్చి ఏసీ వేసుకుని పడుకున్న దొంగ- పోలీసులు వచ్చి లేపి..
UP latest news : ఓ దొంగ.. దొంగతానికి వెళ్లాడు. కానీ ఏసీ వేసుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం పోలీసులు వచ్చి…
UP crime news : ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఒక ఫన్నీ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దొంగతనానికి వచ్చిన ఓ వ్యక్తి.. ఏసీ వేసుకుని ఘాడ నిద్రలోకి జారుకున్నాడు! చివరికి ఏం జరిగిందంటే..
ఇదీ జరిగింది..
లక్నోలోని ఇందిరా నగర్లో డా. సునీల్ పాండే ఇల్లు ఉంది. ఉద్యోగ నేపథ్యంలో ఆయన కొన్ని రోజుల క్రితం వారణాసికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇళ్లు ఖాళీగా ఉంది.
కాగా.. ఆదివారం తెల్లవారుజామున సమయలో.. ఓ వ్యక్తి గేట్ తీసుకుని లోపలికి వెళ్లాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. అతను ఒక దొంగ. ఫుల్‌గా మద్యం సేవించి, దొంగతనానికి వచ్చాడు. కానీ దొంగతనం చేయలేదు! డ్రాయింగ్ రూమ్‌లో అతనికి ఏసీ కనిపించింది. అది ఆన్ చేసుకుని, నేల మీద పడుకుని, తల కింద కుషన్ పెట్టుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకున్నాడు. ఇలా కొన్ని గంటలు గడిచాయి. సూర్యుడు ఉదయించాడు.
Thief sleeps in lucknow house : డా. సునీల్ ఇంటి గేటు తెరిచి ఉండటాన్ని గమనించిన కొందరు.. ఆయన తిరిగి వచ్చారమో అని ఫోన్ చేశారు. కానీ తాను ఇంకా వారణాసిలోనే ఉన్నట్టు ఆయన చెప్పాడు. స్వయంగా ఆయనే, పోలీసులకు కాల్ చేశాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఇందిరా నగర్‌లోని సునీల్ ఇంటికి వెళ్లారు. తలుపు తెరిచి గాలించగా.. డ్రాయింగ్ రూమ్‌లో ప్రశాంతంగా, సుఖంగా, ఏసీ వేసుకుని నిద్రపోతున్న ఓ వ్యక్తి కనిపించాడు.
Lucknow latest news : షర్ట్ విప్పేసి, చేతులో ఫోన్ పట్టుకుని ప్రశాంతంగా పడుకున్న ఆ వ్యక్తి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అతడిని లేపి విచారించగా.. అసలు విషయం బయటపడింది. సదరు వ్యక్తి ఒక దొంగ అని, ఇంట్లో దొంగతనం చేసేందుకు వచ్చాడని పోలీసులు తెలుసుకున్నారు. కానీ మద్యం మత్తులో ఏసీ వేసుకుని పడుకుండిపోయాడని అధికారులకు అర్థమైంది.
UP latest news : "ఆ వ్యక్తి ఫుల్‌గా మద్యం సేవించి ఉన్నాడు. అందుకే నిద్ర వచ్చింది. ఏసీ వేసుకుని పడుకుండిపోయాడు. ఈ విషయాన్ని ఇరుగుపొరుగువారు చెప్పారు. మేము ఇంటికి వెళ్లాము. అతడిని లేపి, అసలు విషయం తెలుసుకున్నాము. అనంతరం అతడిని అరెస్ట్ చేశాము," అని అధికారులు ఓ జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు.
ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
దొంగతనానికి వెళ్లిన దొంగ, ఇంట్లో ఏసీ వేసుకుని పడుకున్నాడన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త విన్న వారందరు నవ్వుకుంటున్నారు. ‘ఎవడ్రా నువ్వు.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు,’ అని కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి ఫన్నీ సంఘటనలు యూపీలో తరచూ జరుగుతూనే ఉంటాయని ఇంకొందరు చెబుతున్నారు. ‘వేసవి కాలంలో దొంగతనాలంటే ఇంతే!’ అని మరికొందరు అంటున్నారు.
మరి.. దొంగతనానికి వెళ్లి, దొంగతనం చేయకుండా.. ఏసీ వేసుకుని పడుకుని, చివరికి పోలీసులు లేపితే లేచిన ఆ వ్యక్తి మీద మీ ఒపీనియన్ ఏంటీ?
సంబంధిత కథనం