Home loan EMI | మీకు ఈ మూడు బ్యాంక్‌ల్లో హోం లోన్ ఉందా? ఈఎంఐ ఎంతో చూసుకోండి..-these banks hike home loan interest rates here s how much your emi will go up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  These Banks Hike Home Loan Interest Rates : Here's How Much Your Emi Will Go Up

Home loan EMI | మీకు ఈ మూడు బ్యాంక్‌ల్లో హోం లోన్ ఉందా? ఈఎంఐ ఎంతో చూసుకోండి..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం
ప్ర‌తీకాత్మ‌క చిత్రం

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపొ రేట్‌ను 5.4 శాతానికి పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్న నేప‌థ్యంలో ప‌లు బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌కు ఇచ్చిన గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచ‌డం ప్రారంభించాయి. తాజాగా ఆ జాబితాలోకి ఈ మూడు బ్యాంకులు కూడా చేరాయి.

రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు పెర‌గ‌డంతో బ్యాంకులు గృహ రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచుతున్నాయి. తాజాగా, ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank), బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(Bank of Baroda), కెన‌రా బ్యాంక్‌(Canara Bank) లు కూడా వ‌డ్డీ రేట్ల‌ను పెంచాయి. ఆ మేర‌కు వినియోగ‌దారుల‌పై ఈఎంఐల భారం పెర‌గ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank)

external benchmark-based lending rates (EBLR)ను పెంచుతూ శుక్ర‌వారం ఐసీఐసీఐ బ్యాంక్‌(ICICI Bank) నిర్ణ‌యం తీసుకుంది. ఈ పెంపు అనంత‌రం 8.6 గా ఉన్న ఐసీఐసీఐ బ్యాంక్ I- EBLR 9.10 శాతానికి చేరింది. ఈ మేర‌కు గృహ‌రుణాలు I- EBLRతో లింక్ అయి ఉన్న వినియోగ‌దారులు వ‌చ్చే నెల నుంచి ఎక్కువ ఈఎంఐ క‌ట్టాల్సి ఉంటుంది. ఒక‌వేళ మీరు రూ. 35 ల‌క్ష‌ల రుణం 20 సంవ‌త్స‌రాల కాల ప‌రిమితితో తీసుకుని ఉన్న‌ట్ల‌యితే.. ఇప్ప‌టివ‌ర‌కు రూ. 30,596 గా ఉన్న మీ ఈఎంఐ సెప్టెంబ‌ర్ నుంచి సుమారు రూ. 31,716 గా ఉంటుంది. అంటే, అద‌నంగా నెల‌కు దాదాపు రూ. 1120 మీరు చెల్లించాల్సి ఉంటుంది.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(Bank of Baroda)

రెపో రేటు పెంపు ప్ర‌భావంతో బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(Bank of Baroda) కూడా Baroda Repo Linked Lending Rate (BRLLR) తో లింక్ అయి ఉన్న రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఆగ‌స్ట్ 6 వ తేదీ నుంచి అన్ని రుణాల‌పై ఈ పెంపు వ‌ర్తిస్తుంది. ఈ పెంపుతో Baroda Repo Linked Lending Rate (BRLLR) 7.95 శాతానికి చేరుతుంది. ప్ర‌స్తుతం ఈ బ్యాంక్ గృహ రుణాల వ‌డ్డీ రేట్లు 7.95 % నుంచి 9.30 % వ‌ర‌కు ఉన్నాయి. ఈ మేర‌కు వారి నెల‌వారీ వాయిదాల్లో కూడా పెంపు ఉంటుంది. ఆగ‌స్ట్ 7 వ తేదీ నుంచి అన్ని రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్న‌ట్లు కెన‌రా బ్యాంక్(Canara Bank) ప్ర‌క‌టించింది. వివిధ కాల వ్య‌వ‌ధుల‌కు స‌వ‌రించిన MCLR ల‌ను త‌మ వెబ్‌సైట్లో పొందుప‌ర్చింది. అయితే, ఈ కొత్త రేట్లు ఆగ‌స్ట్ 7వ తేదీ త‌రువాత పొందిన రుణాలు, లేదా ఆగ‌స్ట్ 7 లోపు మొద‌టి వాయిదా రుణ‌ మొత్తం పొందిన‌ రుణాల‌కే వ‌ర్తిస్తుంద‌ని తెలిపింది.

WhatsApp channel