Same sex marriage: స్వలింగ వివాహాలు చట్టబద్ధమైన దేశాలేవో తెలుసా?-these are the countries across the world where same sex marriage is legal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  These Are The Countries Across The World Where Same Sex Marriage Is Legal

Same sex marriage: స్వలింగ వివాహాలు చట్టబద్ధమైన దేశాలేవో తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 04, 2023 02:31 PM IST

Same sex marriages: స్వలింగ వివాహాలు, ఎల్జీబీటీక్యూ(LGBTQ) కమ్యూనిటీ హక్కులు, సమస్యలపై భారత్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించిన దేశాల వివరాలు ఇవే.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Same sex marriages: స్వలింగ వివాహాలు, ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ హక్కులు, సమస్యలపై భారత్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. స్వలింగ వివాహాల చట్టబద్ధతపై ప్రస్తుతం సుప్రీంకోర్టు (Supreme Court) లో రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 దేశాల్లో స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత లభించింది.

ట్రెండింగ్ వార్తలు

Same sex marriages: భిన్న వాదనలు..

భారత్ లో స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించడానికి సంబంధించి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆ ప్రతిపాదనను సమర్ధిస్తూ ఒక వర్గం, వ్యతిరేకిస్తూ మరో వర్గం తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు (Supreme Court) లో కూడా ఆ వాదనల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. స్వలింగ వివాహాలను (Same sex marriages) సమర్ధించకూడదని, అది సామాజికంగా పెను అనర్ధాలకు దారి తీస్తుందని, దాని వల్ల భారతదేశ సామాజిక, సాంస్కృతిక జీవనానికి పునాది వంటి కుటుంబ వ్యవస్థ నాశనమవుతుందని, భవిష్యత్ తరాలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఒక వర్గం వాదిస్తోంది. ఈ వాదనను కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కూడా సమర్ధిస్తోంది. మరోవైపు, ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీ కూడా భారతదేశ పౌరులేనని, వారికి కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉంటాయని, స్వీయ జీవన విధానాన్ని నిర్ణయించుకునే, నిర్ధారించుకునే హక్కు వారికి ఉంటుందని, దాన్ని చట్టబద్ధంగా అంగీకరించాలని, స్వలింగ వివాహాల (Same sex marriages) వల్ల సమాజానికి ఎలాంటి హాని జరగబోదని, స్వలింగ వివాహాలు చేసుకున్నవారిని వేధించడం నిలిపివేయాలని, అన్ని సామాజిక ప్రయోజనాలను వారికి కూడా కల్పించాలని సేమ్ సెక్స్ మ్యారేజెస్ (Same sex marriages) ను సమర్ధించే వారు గట్టిగా వాదిస్తున్నారు. కొంతవరకు సుప్రీంకోర్టు (Supreme Court) కూడా ఈ వాదనకు అనుకూలంగా పలుమార్లు వ్యాఖ్యలు చేసింది.

Countries where Same sex marriages are legal: ఏ దేశాల్లో చట్టబద్ధం..

కాగా, ప్రపంచ దేశాల్లో, ముఖ్యంగా అభివృద్ది చెందిన దేశాల్లో, స్వలింగ వివాహాలకు (Same sex marriages) ఏనాడో చట్టబద్ధత లభించింది. ఇప్పటివరకు ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ క చట్టబద్ధత కల్పించిన చివరి దేశంగా అండోరా నిలిచింది. పశ్చిమ యూరోప్ దేశాల్లో అనేకం స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించాయి. క్యూబా వంటి లాటిన్ అమెరికా దేశాలు కూడా ఈ దిశగా అడుగులు వేశాయి. అర్జెంటీనాలో 2010, బ్రెజిల్ లో 2013 కొలంబియాలో 2016 నుంచే ఈ వివాహాలకు చట్టబద్ధత ఉంది. ఆసియా ఖండంలో ఇప్పటివరకు ఒక్క తైవాన్ మాత్రమే స్వలింగ వివాహాలకు (Same sex marriages) చట్టబద్ధత కల్పించింది. అలాగే, ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా మాత్రమే ఈ విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ఇటలీ, గ్రీస్ ల్లో స్వలింగ సంపర్కులకు సంబంధించిన యూనియన్లకు కూడా అనుమతి లేకపోవడం విశేషం.

Countries where Same sex marriages are legal: సంవత్సరాల వారీగా..

స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించిన దేశాలు, సంవత్సరాల వారీగా ఈ కింద ఉన్నాయి.

2001 : నెదర్లాండ్స్; 2003 : బెల్జియం; 2005: కెనడా, స్పెయిన్; 2006: దక్షిణాఫ్రికా; 2009: నార్వే, స్వీడన్; 2010: అర్జెంటీనా, ఐజ్లాండ్, పోర్చుగల్; 2012: డెన్మార్క్; 2013: ఇంగ్లండ్, వేల్స్, బ్రెజిల్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఉరుగ్వే; 2014: లక్సెంబర్గ్, స్కాట్లాండ్; 2015: ఫిన్లాండ్, ఐర్లాండ్, యూఎస్ఏ; 2016: కొలంబియా, గ్రీన్ లాండ్; 2017: ఆస్ట్రేలియా, జర్మనీ, మాల్టా; 2019: ఆస్ట్రియా, ఈక్వెడార్, తైవాన్, నార్త్ ఐర్లాండ్; 2020: కొస్టారికా; 2021: చిలీ; 2022: స్విట్జర్లాండ్, స్లొవేనియా, క్యూబా; 2023: అండోరా.

IPL_Entry_Point