5 most and least secure countries: సురక్షిత సూచీలో భారత్ స్థానం ఎక్కడో తెలుసా?
5 most and least secure countries: అంతర్జాతీయ సంస్థ ‘గాలప్’ ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతల పరంగా అత్యంత సురక్షితమైన, అలాగే అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది.
5 most and least secure countries: ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో 1,27,000 మందిని ఇంటర్వ్యూ చేసిన ఈ Gallup's Law and Order Index 2022ను రూపొందించారు. Marina Bay Sands
5 most and least secure countries: భారత్ కు 80 పాయింట్లు..
ఈ జాబితాలో భారత్ 80 పాయింట్లతో 60 వ ర్యాంక్ సాధించింది. అయితే, ఈ జాబితాలో పాకిస్తాన్, శ్రీలంక వంటి పొరుగు దేశాల కన్నా భారత్ వెనుకబడి ఉండడం గమనార్హం. మరోవైపు, అభివృద్ధి చెందిన దేశమైన యూకే కన్నా భారత్ ముందుంది. ప్రాంతాల వారీగా చూస్తూ తూర్పు ఆసియా దేశాలు లా అండ్ ఆర్డర్ లో ప్రశంసనీయ స్థానంలో ఉన్నాయి. ఆ తరువాత ఆగ్నేయాసియా దేశాలున్నాయి.
5 most and least secure countries: మొదటి, చివరి ఐదు దేశాలు
ఈ Gallup's Law and Order Index 2022 లో తొలి స్థానంలో 96 పాయింట్లతో సింగపూర్ నిలిచింది. ఆ తరువాతి నాలుగు స్థానాల్లో తజకిస్తాన్, నార్వే, స్విట్జర్లాండ్, ఇండోనేషియా దేశాలున్నాయి. అలాగే, చివరి స్థానంలో 51 పాయింట్లతో అఫ్గానిస్తాన్ ఉంది. గత మూడు జాబితాల్లో కూడా అఫ్గానిస్తానే చివరి స్థానంలో ఉంది. అఫ్గానిస్తాన్ కన్నా ముందు సియెర్రా లియోన్, డీఆర్ కాంగో, వెనెజువెలా, గాబన్ దేశాలున్నాయి.
5 most and least secure countries: శాంతియుత దేశాల జాబితా
Singapore | 96 |
Tajikistan | 95 |
Norway | 93 |
Switzerland | 92 |
Indonesia | 92 |