ఒకేసారి 20 అడుగుల ఎత్తు పెరిగిన ఈఫిల్ టవర్.. ఎలా సాధ్యం?
Eiffel Tower | ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని ఈఫిల్ టవర్.. ఏడు వింతల్లో ఒకటని తెలిసిన విషయమే. అయితే తాజాగా దీని ఎత్తు దాదాపు 20అడుగులు పెరిగింది! ఇదెలా సాధ్యమైందంటే..
Eiffel Tower height | ఏడు ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ఎత్తు మంగళవారం అమాతం దాదాపు 20 అడుగులు(ఆరు మీటర్లు) పెరిగిపోయింది. కొత్తగా దానిపైన కమ్యూనికేషన్ యాంటీనా ఏర్పాటు చేయడమే ఇందుకు కారణం.
ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో.. హెలికాఫ్టర్ సాయంతో డిజిటల్ యాంటీనాను ఈఫిల్ టవర్‌పైన అమర్చారు ఇద్దరు ఇంజినీర్లు. ఫలితంగా ఈఫిల్ టవర్ ఎత్తు 1,063 అడుగులకు పెరిగింది. ఈ ప్రక్రియను పర్యాటకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
కాగా 1889 మార్చ్ 31న ఈఫిల్ టవర్‌ను ఆవిష్కరించగా.. దాని ఎత్తు 1,024అడుగులు ఉండేది.
రేడీయోకు దన్నుగా..
రేడియో సాంకేతికత వెలుగులోకి వచ్చిన తొలినాళ్ల నుంచి, అభివృద్ధి చెందుతూ.. కొత్త రూపాలు పుట్టుకొస్తున్న సమయం వరకు ఈఫిల్ టవర్ భాగస్వామిగా ఉంది.
తొలుత మిలిటరీకి రేడియో సేవల కోసం ఈఫిల్ టవర్‌ను వినియోగించే వారు. 1910లో టెలిగ్రామ్ సేవల కోసం ఉపయోగించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈఫిల్ టవర్ చాలా సేవలు చేసింది.
2000లో డిజిటల్ టెలివిజన్ కోసం చివరిగా యాంటీనాను అమర్చారు. ఇక తాజాగా.. హెలికాఫ్టర్ సాయంతో ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన యాంటీనాను డిజిటల్ రేడియో కోసం ఉపయోగించనున్నారు.
సంబంధిత కథనం