THDC Recruitment: టీహెచ్డీసీ లో ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
THDC Recruitment: ట్రైనీ ఇంజనీర్ పోస్ట్ ల భర్తీకి టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్ శనివారం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీహెచ్డీసీ అధికారిక వెబ్ సైట్ thdc.co.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మార్చి 29.
Engineer Trainee jobs in THDC: టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్ ఇంజినీర్ ట్రైనీ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది, దరఖాస్తు ఫారమ్ సమర్పించడానికి చివరి తేదీ మార్చి 29. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు టీహెచ్డీసీ అధికారిక వెబ్ సైట్ thdc.co.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
టీహెచ్డీసీ లో ఇంజినీర్ ట్రైనీ పోస్ట్ లకు అవసరమైన అర్హతలు
టీహెచ్డీసీ లో ఇంజినీర్ ట్రైనీ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023కు హాజరై ఉండాలి. 2023 గేట్ స్కోర్ ఆధారంగానే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
వేకెన్సీ వివరాలు..
మొత్తం 100 ఇంజనీర్ ట్రైనీస్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & ఇన్స్ట్రుమెంటేషన్) పోస్టులను భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ (ఎన్సీఎల్) కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్ సర్వీస్ మెన్/డిపార్ట్ మెంటల్ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఇలా అప్లై చేయండి
- ముందుగా అభ్యర్థులు టీహెచ్డీసీ అధికారిక వెబ్ సైట్ thdc.co.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపిస్తున్న Job Opportunities పై క్లిక్ చేయండి.
- Engineer Trainee Recruitment లింక్ పై క్లిక్ చేయండి
- Apply లింక్ పై క్లిక్ చేయండి.
- అప్లికేషన్ ఫారం నింపండి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్ లను అప్ లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
- భవిష్యత్తు రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.