Thailand black noodles : నల్ల రంగులో ‘నూడుల్స్’​.. చూస్తేనే వికారం! ఎలా తింటారో?-thailands unique black noodles video goes viral internet reacts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Thailand's Unique Black Noodles Video Goes Viral, Internet Reacts

Thailand black noodles : నల్ల రంగులో ‘నూడుల్స్’​.. చూస్తేనే వికారం! ఎలా తింటారో?

Sharath Chitturi HT Telugu
Feb 18, 2023 10:47 AM IST

Thailand black noodles viral video : సాధారణంగా.. తెల్లరంగులో ఉన్న నూడుల్స్​ చూస్తూనే ఉంటాము. మరి నల్ల రంగులో నూడుల్స్​ను ఎప్పుడైనా చూశారా? ఆ బ్లాక్​ నూడుల్స్​తో వంట చేస్తే ఎలా ఉంటుంది?

నల్ల రంగులో ‘నూడుల్స్’​..
నల్ల రంగులో ‘నూడుల్స్’​..

Thailand black noodles viral video : ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వింత వింత వంటకాలు వైరల్​గా మారుతున్నాయి. ఈ జాబితాలోకి 'బ్లాక్​ నూడుల్స్​' చేరింది! నూడుల్స్​ అంటే తెల్లరంగు గుర్తొస్తుంది. కానీ థాయ్​లాండ్​లో నల్ల రంగులో ఉన్న నూడుల్స్​ను వంటలో వినియోగిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఇది చూసి నెటిజన్లు షాక్​ అవుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

నల్ల రంగులో నూడుల్స్​..!

ఇన్​స్టాగ్రామ్​లో 'అవర్​ కలెక్షన్​' అనే అకౌంట్​ ఈ వీడియోను షేర్​ చేసింది. ఈ వీడియో థాయ్​లాండ్​లో తీసినది. ఓ మహిళ.. తొలుత పెనం మీద బ్లాక్​ నూడుల్స్​ వేసింది. దాని మీద ఉప్పు చల్లింది. కూరగాయలు, ఇతర పదార్థాలు వేసింది. పెనంపై వాటిని వేయించడం మొదలుపెట్టింది. ఈ బ్లాక్​ స్పెగెట్టీతో ఆ మహిళ పాస్తా చేస్తున్నట్టు తెలుస్తోంది. పాస్తా సిద్ధమైనప్పుడు.. మరిన్ని పదార్థాలు మిక్స్​ చేసి, వాటిని ఓ ప్లేట్​లో పెట్టింది.

Black noodles viral video : చూడటానికి ఇదంతా సాధారణంగా, బాగానే ఉన్నా.. ఆ నూడుల్స్​ రంగు చూస్తేనే కాస్త వింతగా, వికారంగా ఉంది. "యునీక్​ స్ట్రీట్​ ఫుడ్​ ఆఫ్​ థాయ్​లాండ్​" అని క్యాప్షన్​ ఇచ్చింది ఈ ఇన్​స్టాగ్రామ్​ ఛానెల్​. ఫిబ్రవరి 1న పోస్ట్​ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 50లక్షలకుపైగా వ్యూస్​ వచ్చాయి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

నెటిజన్లు షాక్​..

ఈ బ్లాక్​ నూడుల్స్​ను చూసిన చాలా మంది షాక్​కు గురవుతున్నారు.

Thailand viral video : "మార్వెల్​లోని వెనమ్​ క్యారెక్టర్​ గుర్తుందా? ఈ నూడుల్స్​.. వెనమ్​ను గుర్తుచేస్తోంది," అని ఓ నెటిజన్​ కామెంట్​ పెట్టగా.. 'ఇది తినడం అసాధ్యం. అసలు ఎలా తింటారో ఇలాంటివి. చాలా కష్టం,' అని మరొకరు రాసుకొచ్చారు.

"ఇది నూడుల్స్​ ఆఆ? నేను పురుగులు అనుకున్నా.. వండుతుంటే ఇంకా కదలడం లేదేంటి? అని అనుకున్నాను," అని మరో నెటిజన్​ ఫన్నీ కామెంట్​ చేశారు. 'వికారం వస్తోంది,' అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. “చాలా రుచికరమైన వంట ఇది. అస్సలు మిస్​ అవ్వకూడదు,” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చారు.

Black noodles Thailand : ఈ వీడియో బ్యాంకాక్​లో తీసినట్టు తెలుస్తోంది. ఇలాంటి వీడియోలు తరచూ వైరల్​గా మారుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇవి చక్కర్లు కొడుతున్నాయి.

IPL_Entry_Point