Rape survivor killed : అత్యాచార బాధితురాలిని వెంటాడి- వెంటాడి నరికి చంపిన నిందితుడు!
Rape survivor killed : మూడేళ్ల క్రితం రేప్ చేసిన యువతిని.. ఓ వ్యక్తి తాజాగా హత్య చేశాడు. తనపై వేసిన కేసును వెనక్కి తీసుకోవడం లేదన్న కోపంతో.. నడిరోడ్డుపై వెంటాడి వెంటాడి చంపేశాడు. యూపీలో జరిగింది ఈ ఘటన.
Rape survivor killed : ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 19ఏళ్ల అత్యాచార బాధితురాలిని.. కొన్నేళ్ల క్రితం ఆమెను రేప్ చేసిన వ్యక్తి.. వెంటాడి-వెంటాడి నరికి చంపేశాడు! ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ కౌషంబి జిల్లాలోని థేర్హా గ్రామంలో జరిగింది ఈ ఘటన. 19ఏళ్ల యువతిని.. మూడేళ్ల క్రితం, ఆమె మైనర్‌గా ఉన్నప్పుడు పవన్ నిషాద్ అనే వ్యక్తి తన సన్నిహితులతో కలిసి రేప్ చేశాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి, అతడిపై కేసు వేసింది. అప్పటి నుంచి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు పవన్. అతను జైలుకు వెళ్లిన తర్వాత.. పవన్ కుటుంబసభ్యులు ఆమెను బెదిరించేవారు. కేసు వెనక్కి తీసుకోవాలని అడిగేవారు. కానీ ఆ యువతి.. కేసు వెనక్కి తీసుకోలేదు.
ఈ క్రమంలో.. యువతిని చంపాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఇందుకోసం.. అతడి సోదరుడు అశోక్ నిషాద్ సాయం తీసుకున్నాడు. మరో కేసులో అశోక్ నిషాద్ కూడా జైలుకు వెళ్లాడు. రెండు రోజుల క్రితమే.. బయటకు వచ్చాడు. ఆ సమయానికి పవన్ కూడా జైలు బయటే ఉన్నాడు. ఇద్దరు కలిసి.. యువతిని చంపాలని ప్లాన్ చేశారు.
Rape survivor killed in UP : యువతి, తన పశువులను మేతకు తీసుకెళ్లి, ఇంటికి తిరిగి వెళుతుండగా.. నిందితులు ఆమెపై దాడి చేశారు. ఆమెను వెంటాడి.. వెంటాడి గొడ్డలితో నరికి చంపేశారు. భయాందోళనకు గురైన స్థానికులు.. ఆ దృశ్యాలను చూస్తూ ఉండిపోయారు!
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లి యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
"బాధితురాలు, నిందితులు ఒకటే కులానికి చెందినవారు. రెండు వర్గాల మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఒక వర్గం తరఫు వ్యక్తులు.. యువతిని పదునైన ఆయుధంతో నరికి చంపేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నాము," అని పోలీసులు వెల్లడించారు.
Uttar Pradesh crime news : కాగా.. నిందితులు పవన్, అశోక్‌లు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగింది. అధికార బీజేపీపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు భద్రత లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు.
ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. 2021లో యూపీలో మహిళలపై 56వేలకుపైగా నేరాలు జరిగాయి. వీటిల్లో రేప్, మర్డర్, యాసిడ్ దాడులు ఎక్కువగా ఉన్నాయి.
సంబంధిత కథనం