మైనర్ బాలికపై కజిన్ అత్యాచారం.. పోక్సో కేసు నమోదు-teen girl raped by cousin in bijnor accused held ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Teen Girl Raped By Cousin In Bijnor Accused Held

మైనర్ బాలికపై కజిన్ అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

HT Telugu Desk HT Telugu
Nov 24, 2023 04:52 PM IST

ఉత్తర ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ మైనర్ బాలికపై సమీప బంధువు అత్యాచారానికి పాల్పడిన ఉదంతమిది.

మైనర్ బాలికపై కజిన్ అత్యాచారం (ప్రతీకాత్మక చిత్రం)
మైనర్ బాలికపై కజిన్ అత్యాచారం (ప్రతీకాత్మక చిత్రం)

బిజ్నోర్ (యూపీ), నవంబరు 24: 13 ఏళ్ల బాలికపై ఆమె కజిన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

గురువారం సాయంత్రం మైనర్ బాలిక తన పశువులను మేపడానికి బయటకు వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఏఎస్పీ (రూరల్) రామ్ రాజ్ తెలిపారు.

బాలిక కేకలు విన్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి నిందితుడు పరారయ్యాడని ఏఎస్పీ తెలిపారు.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్లు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.

WhatsApp channel