Man kills Wife, Son: ప్లాస్టిక్ బ్యాగ్‍లతో భార్య, కొడుకును చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్న టెక్కీ!-techie kills wife son with plastic bags and commits suicide in pune
Telugu News  /  National International  /  Techie Kills Wife Son With Plastic Bags And Commits Suicide In Pune
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Man kills Wife, Son: ప్లాస్టిక్ బ్యాగ్‍లతో భార్య, కొడుకును చంపి.. తానూ ఆత్మహత్య చేసుకున్న టెక్కీ!

16 March 2023, 9:30 ISTChatakonda Krishna Prakash
16 March 2023, 9:30 IST

Man kills Wife, Son: ఓ వ్యక్తి తన భార్య, కుమారుడిని చంపి.. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పుణెలో ఈ విషాదకర ఘటన జరిగింది.

Man kills Wife, Son: మహారాష్ట్రలోని పుణె(Pune)లో విషాదకర సంఘటన జరిగింది. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఓ వ్యక్తి.. తన భార్య, కూతురిని చంపేశాడు. ప్లాస్టిక్ బ్యాగ్‍లను ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేశాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పుణెలోని ఔంధ్ (Aundh) ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వివరాలను పోలీసులు వెల్లడించారు.

Man kills Wife, Son in Pune: ముందుగా ఆ వ్యక్తి.. భార్య, కొడుకు ముఖాలకు ప్లాస్టిక్ కవర్లు బిగించి ఊపిరాడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్యహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారించినట్టు పోలీసులు వెల్లడించారు. మృతుడిని సుదీప్తో గంగూలీ(44)గా పోలీసులు గుర్తించారు. భార్య ప్రియాంక (40), కొడుకు తనిష్క(8)గా తెలిపారు.

ఫోన్‍కు బదులివ్వకపోవటంతో..

Man kills Wife, Son in Pune: సుదీప్తో గంగూలీ ఫోన్ కాల్‍లకు బదులివ్వకపోవటంతో అతడి సోదరుడికి అనుమానం వచ్చింది. దీంతో విషయం బయటపడింది. “ఫోన్ కాల్‍లకు ఆ దంపతులు ఇద్దరు స్పందించకపోవటంతో విషయం తెలుసుకోవాలని బెంగళూరులో ఉండే సుదీప్తో సోదరుడు.. తన స్నేహితుడికి చెప్పారు. తన సోదరుడి ఇంటికి వెళ్లాలని అడిగాడు. అయితే ఫ్లాట్‍కు తాళం వేసి ఉంటే ఎక్కడికో వెళ్లారనుకొని సుదీప్తో సోదరుడు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు” అని పుణెలోని చతుష్‍రింగ్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు.

Man kills Wife, Son in Pune: అయితే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత విచారణ చేయగా.. ఆ దంపతుల ఫోన్లు ఇంట్లోనే ఉన్నట్టు పోలీసులకు లొకేషన్ డేటా చూపించింది. దీంతో డూప్లికేట్ తాళాన్ని ఉపయోగించి పోలీసులు ఫ్లాట్‍లోకి వెళ్లారు. ఉరివేసుకున్న సుదీప్తోను ముందుగా చూశారు. ముఖాలకు పాలిథిన్ బ్యాగ్‍లతో చనిపోయి ఉన్న అతడి భార్య, కుమారుడిని గుర్తించారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు వెల్లడించారు.

Man kills Wife, Son in Pune: సుదిప్తో గంగూలీ ఇటీవల తన సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించారని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై అన్ని కోణాలు దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు.