TCS Q1 Results: టీసీఎస్ నికర లాభంలో 5 శాతం పెరుగుదల-tcs reports over 5 percent jump in june quarter profit on strong deal wins ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Tcs Reports Over 5 Percent Jump In June-quarter Profit On Strong Deal Wins

TCS Q1 Results: టీసీఎస్ నికర లాభంలో 5 శాతం పెరుగుదల

Praveen Kumar Lenkala HT Telugu
Jul 08, 2022 05:00 PM IST

TCS-RESULTS: టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. నికర లాభంలో 5 శాతం పెరుగుదల నమోదు చేసింది.

క్యూ4లో నికర లాభంలో 5 శాతం పెరుగుదల కనబరిచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)
క్యూ4లో నికర లాభంలో 5 శాతం పెరుగుదల కనబరిచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) (REUTERS)

బెంగళూరు: టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (టీసీఎస్) 2022-23 ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. జూన్‌తో ముగిసిన ఈ క్వార్టర్‌లో నికర లాభంలో 5.2 శాతం పెరుగుదల కనిపించిందని వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

డిజిటైజ్ ఆపరేషన్ల పెరుగుదల కారణంగా ఇండియాలోని అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌కు భారీ కాంట్రాక్టులు లభించాయి. వీటి ద్వారా టీసీఎస్ ప్రయోజనం పొందింది.

ఈ క్వార్టర్ (ఏప్రిల్-జూన్) లో నికర లాభం రూ. 9,478 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ. 9,008 కోట్లుగా ఉంది. కాగా కార్యకలాపాల ద్వారా రెవెన్యూ 16.2 శాతం పెరిగింది.

అయితే మార్చితో ముగిసిన క్యూ4 నికర లాభంతో పోల్చితే జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో నికర లాభం 4.5 శాతం తగ్గింది. క్యూ4లో నికర లాభం రూ. 9,926 కోట్లుగా ఉంది.

కాగా కంపెనీ షేరుకు ఒక్కంటికి రూ. 8 ల చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది.

కాగా దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో జూన్ 30 నాటికి 6,06,331 మంది ఉద్యోగులు ఉన్నారు. మొదటి త్రైమాసికంలో నికరంగా 14,136 ఉద్యోగులు చేరారు. కాగా అట్రిషన్ రేట్ స్వల్పంగా పెరిగి 19.7 శాతంగా ఉందని కంపెనీ తెలిపింది.

టీసీఎస్ ఉద్యోగుల వేతం 8 శాతం పెంచినట్టు చీఫ్ హెచ్ఆర్ అధికారి మిలింద్ లక్కడ్ తెలిపారు. 5 శాతం నుంచి 8 శాతం వరకు వేతనాలు పెరిగాయని, టాప్ పర్‌ఫార్మర్లకు మరింతగా పెరిగాయని వివరించారు.

టీసీఎస్‌ వర్క్‌ఫోర్స్‌లో మొత్తం 153 దేశాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 35.5 శాతం ఉద్యోగులు మహిళలు కావడం విశేషం.

కాగా ఉద్యోగులు ఆఫీస్ నుంచి పనిచేసే విధానాన్ని ప్రోత్సహిస్తోంది. క్యూ 1లో దాదాపు 20 శాతం మంది ఉద్యోగులు కార్యాలయం నుంచే పని చేశారు.

IPL_Entry_Point

టాపిక్