TCS, Infosys shares: ఏడాది కనిష్టస్థాయికి టీసీఎస్, ఇన్ఫోసిస్..
Tcs, Infosys shares: టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ షేర్ల ధరలు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఐటీ రంగంలో ఎదురుగాలి వీస్తోందని, అలాగే డాలర్ రెవెన్యూ నెమ్మదించిందని, స్థూల ఆర్థిక అంశాల్లో ఒత్తిడి ఈ పరిస్థితికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఐటీ సూచీ 27 శాతం పతనమైంది. నిఫ్టీ 50 సూచీలో ఐటీ ఇండెక్స్ పేలవమైన పనితీరు కనబరుస్తోంది.
టాప్ ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ షేర్లు ప్రస్తుతం రికార్డుస్థాయి దిగువన రూ. 2,973 వద్ద ట్రేడవుతున్నాయి. 2022లో ఈ ఐటీ స్టాక్ ఇప్పటి వరకు 20 శాతం మేర నష్టపోయింది. జూన్ 2022తో ముగిసిన మొదటి క్వార్టర్‌లో టీసీఎస్ తన నికర లాభంలో 5 శాతం వృద్ధి చూపింది. అది అనలిస్టుల అంచనాలను అందుకోలేకపోయింది. డిమాండ్ బాగానే ఉన్నప్పటికీ ఉద్యోగులపై వ్యయం పెరగడం కారణంగా నికర లాభంపై ప్రభావం పడింది.
ఇన్ఫోసిస్ షేర్లు ఇలా..
ఇన్ఫోసిస్ షేర్లు 52 వారాల కనిష్టానికి పడిపోయి రూ. 1,360 వద్ద ట్రేడవుతోంది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఈ ఏడాది ఇప్పటి వరకు 27 శాతం పడిపోయింది. జూన్‌తో ముగిసిన క్వార్టర్‌లో అంచనాలను అందుకోలేకపోయింది. నికర లాభంలో 3 శాతం పెరుగుదలను చూపింది. ఆపరేటింగ్ మార్జిన్‌లో తగ్గుదల, వ్యయాల పెరుగుదల కారణంగా నికర లాభం తగ్గింది.
అంతర్జాతీయ బ్రోకరేజ్, రీసెర్చ్ సంస్థ గోల్డ్‌మాన్ సాక్స్ టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల రేటింగ్‌ను తగ్గించింది. బయ్ రేటింగ్ మార్చి సెల్ రేటింగ్ ఇచ్చింది. భారతీయ ఐటీ కంపెనీల ఆదాయం కంటే ఈబీఐటీ మార్జిన్ అంచనాలపై ఎక్కువ నమ్మకంగా ఉందని పేర్కొంది. ‘రాబోయే మాక్రో స్లోడౌన్ (మాంద్యం కాదు)పై మా బృందం అంచనా వేస్తుంది. భారతీయ ఐటి రంగానికి డాలర్ రెవెన్యూ రాబడి వృద్ధి ఇక్కడ నుండి భౌతికంగా మందగించడం ప్రారంభిస్తుందని మేం నమ్ముతున్నాం. టాప్ 5 కంపెనీల కోసం మా 2023-24 డాలర్ రాబడి వృద్ధి అంచనాలను సగటున 4 నుండి 6% తగ్గించాం. మా మునుపటి అంచనా 10 శాతంగా ఉంది..’ అని పేర్కొంది.
(ఈ అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు లేదా బ్రోకింగ్ కంపెనీలవిగా గమనించగలరు. హెచ్‌టీవి కావు..)