Budget 2023: వేతన జీవులకు ఈ ఊరట లభించనుందా?-taxpayers expect a change in income tax structure from budget 2023 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Taxpayers Expect A Change In Income Tax Structure From Budget 2023

Budget 2023: వేతన జీవులకు ఈ ఊరట లభించనుందా?

HT Telugu Desk HT Telugu
Dec 27, 2022 10:50 AM IST

Budget 2023: గత బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశే మిగిలింది. కానీ పెరిగిన ద్రవ్యోల్భణం, జీవన వ్యయం వేతన జీవులను బాగా దెబ్బతీశాయి.

నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనివ్వనున్నారా?
నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరటనివ్వనున్నారా? (Amlan Paliwal)

ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. మరికొద్ది రోజుల్లో రానున్న బడ్జెట్‌పై భారతీయులంతా కొత్త ఆశలతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పారిశ్రామిక వేత్తల నుంచి వేతన జీవుల వరకు బడ్జెట్ 2023 తమకు సరికొత్త ఊరట తేనుందన్న నమ్మకంతో ఉన్నారు. గత ఏడాది వేతన జీవులకు ఎలాంటి ఊరట లేకపోవడంతో వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈసారి ఆదాయ పన్ను శ్లాబుల్లో మార్పులు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 4 శ్లాబుల ద్వారా ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపులు లభిస్తున్నాయి. వయస్సు, ఆదాయ స్థాయి, వంటి అంశాలు వారు పొందే మినహాయింపులపై ప్రభావం చూపుతాయి.

ట్రెండింగ్ వార్తలు

పాత పన్ను విధానం ప్రకారం అమలులో ఉన్న మినహాయింపు ఇలా..

ప్రస్తుతం 2.5 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను లేదు. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య ఆదాయానికి 5 శాతం ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాలి. ఆదాయం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ఉంటే ఆ మొత్తానికి 20 శాతం ఇన్‌కమ్ టాక్స్ చెల్లించాలి. రూ. 10 లక్షల పైబడి ఆదాయం ఉంటే ఇన్‌కమ్ టాక్స్ 30 శాతం చెల్లించాలి.

Deduction and exemption: తగ్గింపులు, మినహాయింపులు

ప్రస్తుత పన్ను విధానం ప్రకారం వేతన జీవులు ఇన్‌కమ్ టాక్స్ మినహాయింపు ద్వారా కొంత ఊరట పొందుతున్నారు. వేతన జీవులందరూ స్టాండర్డ్ డిడక్షన్ ద్వారా రూ. 50 వేల మినహాయింపు పొందుతారు. అలాగే హెచ్‌ఆర్‌ఏ ఎగ్జెంప్షన్ కింద రెంట్ రిసీప్ట్ సమర్పించడం ద్వారా కొంత మినహాయింపు పొందుతారు. ఇక సెక్షన్ 80 సీ ద్వారా రూ. 1,50,000 ఆదాయానికి పన్ను మినహాయింపు కోరవచ్చు. ఇందులో ఈపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇద్దరు పిల్లలకు స్కూల్ ఫీజు, ఇన్సూరెన్స్ ప్రీమియం, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, ఈఎల్ఎస్ఎస్, యూలిప్, 5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు వంటివి చూపవచ్చు.

సెక్షన్ 80 డీ పరిధిలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియానికి మినహాయింపు కోరవచ్చు. దీని పరిధిలో రూ. 25 వేల వరకు మినహాయింపు కోరవచ్చు. అంటే మీరు హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే దానికి చెల్లించిన ప్రీమియంను పన్ను చెల్లించాల్సిన ఆదాయం నుంచి మినహాయింపు కోరవచ్చు.

New Tax Regime: కొత్త టాక్స్ విధానం

కేంద్రం ఇటీవల రెండు ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చింది. టాక్స్ పేయర్లు పాత పద్ధతిలో వివిధ పద్దుల కింద మినహాయింపులు కోరవచ్చు. లేదా కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులు కోరకుండా పన్ను చెల్లించనూ వచ్చు. కొత్త పన్ను విధానంలో ఉన్న శ్లాబులు పాత పన్ను విధానంలో ఉన్న శ్లాబులతో పోలిస్తే స్వల్ప మార్పులు కలిగి ఉంటాయి.

Budget 2023: బడ్జెట్‌లో ఏం ఆశించవచ్చు..

కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానంలో పన్ను చెల్లించాల్సిన దాయ శ్లాబులను మార్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. డెలాయిట్ ఇండియా అంచనాల ప్రకారం రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షల ఆదాయం ఉన్న వారికి ప్రస్తుతం ఉన్న పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించే అవకాశం ఉంది.

ఇక సెక్షన్ 80 సీ మినహాయింపులు కూడా రూ. 1,50,000 నుంచి పెరిగే అవకాశం ఉంది. ‘ప్రస్తుతం ఉన్న మినహాయింపు చాలా స్వల్పం. ప్రస్తుతం పెరిగిన కాస్ట్ ఆఫ్ లివింగ్, ద్రవ్యోల్భణం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఈ పరిమితి పెంచే అవకాశం ఉంది. అలా చేస్తే వ్యక్తిగత ఇన్‌కమ్ టాక్స్ చెల్లింపుదారులు మరిన్ని సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ధరల పెరుగుదలనూ అదుపు చేయవచ్చు..’ అని డెలాయిట్ ఇండియా పార్ట్‌నర్ తపతి ఘోష్ విశ్లేషించారు. అలాగే గృహ రుణాలపై చెల్లించే వడ్డీకి లభించే మినహాయింపు పరిమితి పెంచనున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

IPL_Entry_Point