Rajasthan horror: రాజస్తాన్ లో తాంత్రికుడి ఘాతుకం
Rajasthan horror: రాజస్తాన్ లో ఒక మంత్రగాడి ఘాతుకం బయటపడింది. ఒక జంటను ఆ మంత్రగాడు అత్యంత రాక్షసంగా హతమార్చాడు.
Rajasthan horror: రాజస్తాన్ లో ఒక మాంత్రికుడు ఒక జంటను దారుణంగా హతమార్చాడు. వారిని తన ముందే లైంగికంగా కలవాలని చెప్పి, వారిపై సూపర్ గ్లూ(ఫెవిక్విక్) ను గుమ్మరించాడు. ఆ తరువాత వారిని రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి చంపేశాడు.
Rajasthan horror: అక్రమ సంబంధం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ లోని ఉదయపూర్ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల రాహుల్ మీనా ప్రభుత్వ టీచర్. ఆయనకు వివాహమై, కూతురు కూడా ఉంది. ఆయనకు సోను కావర్ అనే యువతితో పరిచయమై, అది అక్రమ సంబంధానికి దారి తీసింది. వారు తరచుగా స్థానికంగా ఉండే ఇచ్ఛపూర్ణ శేషనాగ ఆలయానికి వెళ్తుండేవారు. ఆ ఆలయంలోనే ఈ భలేశ్ కుమార్ అనే తాంత్రికుడు ఉండేవాడు. ఆ తాంత్రికుడితో ఆ జంటకు పరిచయం ఏర్పడింది. అదే సమయంలో, రాహుల్ మీనా కు తన భార్యతో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో, రాహుల్ మీనా భార్య తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఈ తాంత్రికుడిని ఆశ్రయించింది.
Rajasthan horror: రాక్షసంగా హతమార్చాడు..
మీనా భార్యకు ఆమె భర్త అక్రమ సంబంధం గురించి ఆ తాంత్రికుడు చెప్పాడు. దాంతో, వారి మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన తాంత్రికుడు రాహుల్ మీనాను, సోను కావర్ ను దగ్గరలోని అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ వారిని సెక్స్ లో పాల్గొనాలని చెప్పి, వారిపై ఫెవి క్విక్ ను గుమ్మరించాడు. ఆ తరువాత, వారిద్దరిని రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి హతమార్చాడు. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
Rajasthan horror: పోలీసుల దర్యాప్తు..
అటవీ ప్రాంతంలో ఒక జంట మృతదేహాలు నగ్నంగా పడి ఉన్న సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాయి. సీసీ కెమెరాల ఫుటేజీ సాయంతో నిందితుడైన తాంత్రికుడు భలేశ్ కుమార్ చేసిన నేరాన్ని గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు కొనసాగిస్తున్నారు.