MK Stalin: బడ్జెట్ లోగో నుంచి రూపీ సింబల్ ను తొలగించి, తమిళంలో ‘రు’ పదాన్ని చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం-tamil nadu govt drops national rupee symbol from budget replaces it with symbol in tamil ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Mk Stalin: బడ్జెట్ లోగో నుంచి రూపీ సింబల్ ను తొలగించి, తమిళంలో ‘రు’ పదాన్ని చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం

MK Stalin: బడ్జెట్ లోగో నుంచి రూపీ సింబల్ ను తొలగించి, తమిళంలో ‘రు’ పదాన్ని చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం

Sudarshan V HT Telugu
Published Mar 13, 2025 04:47 PM IST

Rupee symbol: త్రిభాషా వివాదం మధ్య ఎంకే స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ లోగో నుంచి జాతీయ కరెన్సీ చిహ్నంగా కేంద్ర నిర్ధారించిన రూపాయి చిహ్నాన్ని తొలగించి, ఆ స్థానంలో 'రు' అనే తమిళ అక్షరాన్ని ముద్రించింది. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పడు సంచలనంగా మారింది.

బడ్జెట్ లోగో నుంచి రూపీ సింబల్ ను తొలగించిన స్టాలిన్ ప్రభుత్వం
బడ్జెట్ లోగో నుంచి రూపీ సింబల్ ను తొలగించిన స్టాలిన్ ప్రభుత్వం (PTI file)

Rupee symbol: త్రిభాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లోగోలో నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన రూపాయి చిహ్నాన్ని తొలగించింది. ఆ స్థానంలో 'రు' అనే తమిళ అక్షరాన్ని ముద్రించాలని నిర్ణయించింది. ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తొలగించడం బహుశా ఇదే మొదటిసారి. జాతీయ విద్యావిధానం (NEP), త్రిభాషా విధానాన్ని ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

బడ్జెట్ లోగోలో..

తమిళనాడు ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ బడ్జెట్ లోగోలో తమిళ భాషలో భారతీయ కరెన్సీని సూచించే తమిళ పదం 'రుబాయ్' యొక్క మొదటి అక్షరం 'రు' ముద్రించి ఉంది. ఈ లోగోలో "అందరికీ అంతా" అనే శీర్షిక కూడా ఉంది. ఇది అధికార డీఎంకే తన సమ్మిళిత పాలన నమూనా అని పేర్కొంది.

బీజేపీ విమర్శలు

ఈ చర్యను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై తప్పుబట్టారు. డీఎంకే ప్రభుత్వం 2025-26 రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఒక తమిళుడు రూపొందించిన జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తొలగించిందని, ఈ రూపాయి చిహ్నాన్ని యావత్ భారతదేశం స్వీకరించి మన కరెన్సీలో చేర్చిందని తెలిపారు. ‘‘ఈ చిహ్నాన్ని డిజైన్ చేసింది తమిళుడైన ఉదయ్ కుమార్. ఆయన డీఎంకే మాజీ ఎమ్మెల్యే కుమారుడు. మీరు ఎంత మూర్ఖులు తిరు స్టాలిన్ @mkstalin?’’ అని అన్నామలై తన సోషల్ మీడియా పోస్ట్ లో పేర్కొన్నారు. భారత రూపాయి చిహ్నంతో కూడిన 2024-25 తమిళనాడు బడ్జెట్ లోగోను కూడా ఆయన పంచుకున్నారు.

భారతదేశం కంటే భిన్నమైనది

ఈ మార్పుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అయితే, ఈ చర్య "భారతదేశం కంటే భిన్నమైనది" అనే తమిళ పార్టీ వైఖరిని ప్రతిబింబిస్తుందని బిజెపి అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. రూపాయి చిహ్నాన్ని భారతదేశానికి చిహ్నంగా విస్తృతంగా గుర్తిస్తున్నారని బిజెపికి చెందిన నారాయణన్ తిరుపతి అన్నారు.

ఎన్ఈపీ కి వ్యతిరేకంగా..

జాతీయ విద్యావిధానం 2020లోని కీలక అంశాలను, ముఖ్యంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడానికి తమిళనాడు నిరాకరించడంతో సమగ్ర శిక్షా అభియాన్ (SSA) కింద కేంద్రం అందించే విద్యా సహాయంలో రూ.573 కోట్లను కేంద్రం నిలిపివేసింది. విధాన నిబంధనల ప్రకారం, ఎస్ఎస్ఏ నిధులను పొందడానికి రాష్ట్రాలు జాతీయ విద్యా విధానం (NEP) 2020 మార్గదర్శకాలను పాటించాలి. ఇందులో 60 శాతం తమిళనాడు వంటి రాష్ట్రాలకు కేంద్రం అందిస్తుంది. పీఎం ఎస్ఆర్ఐ పథకం కింద ఎన్ఈపీ 2020ని అమలు చేస్తామని సంబంధిత రాష్ట్రం కేంద్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. దానికి బదులుగా కేంద్రం నిధులు ఇస్తుంది.

Sudarshan V

eMail
He has experience and expertise in national and international politics and global scenarios. He is interested in political, economic, social, automotive and technological developments. He has been associated with Hindustan Times digital media since 3 years. Earlier, He has worked with Telugu leading dailies like Eenadu and Sakshi in various editorial positions.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.