IndiGo: ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన-swedish national arrested for allegedly molesting indigo cabin crew ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
Telugu News  /  National International  /  Swedish National Arrested For Allegedly Molesting Indigo Cabin Crew

IndiGo: ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ తో ప్రయాణికుడి అసభ్య ప్రవర్తన

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Molestation in IndiGo flight: విమానాల్లో ప్రయాణికుల అసభ్య, అశ్లీల ప్రవర్తనకు సంబంధించిన ఫిర్యాదులు పెరుగుతున్నాయి. తాజాగా, ఇండిగో విమానంలో ఎయిర్ హోస్టెస్ తో ఒక విదేశీ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు.

Molestation in IndiGo flight: బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో గురువారం ఈ దారుణం చోటు చేసుకుంది. విమానంలోని ఎయిర్ హోస్టెస్ తో స్వీడన్ కు చెందిన ఒక ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఫిర్యాదుపై అతడిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.

ట్రెండింగ్ వార్తలు

Molestation in IndiGo flight: సీ ఫుడ్ కావాలని..

ఎయిర్ హోస్టెస్ తెలిపిన వివరాల ప్రకారం.. స్వీడన్ కు చెందిన క్లస్ ఎరిక్ హెరాల్డ్ జోనస్ అనే ప్రయాణికుడు బ్యాంకాక్ నుంచి ముంబై వస్తున్నాడు. విమానంలో అతడు సీ ఫుడ్ కావాలని అడిగాడు. ఎయిర్ హోస్టెస్ అతడికి సీ ఫుడ్ అందుబాటులో లేదని చెప్పి చికెన్ ఫుడ్ సర్వ్ చేసింది. తరువాత బిల్ చెల్లించాలని కోరుతూ పీఓఎస్ మెషీన్ తో అతడి వద్దకు వచ్చింది. ఆ సమయంలో ఆ ప్రయాణికుడు ఆమె చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తరువాత మళ్లీ బిల్ చెల్లింపు కోసం ఏటీఎం పిన్ చెప్పాలని కోరిన ఆ యువతితో సీట్ నుంచి లేచి నిల్చుని మరోసారి అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో, ఆ యువతి గట్టిగా అరవడంతో తిరిగి సీట్లో కూర్చున్నాడు. విమానం ముంబై చేరుకున్న వెంటనే, ఇండిగో సిబ్బంది ఏర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో వారు క్లస్ ఎరిక్ హెరాల్డ్ జోనస్ అరెస్ట్ చేశారు. మర్నాడు కోర్టులో హాజరుపర్చగా, కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది.

Molestation in IndiGo flight: మార్చి 23న కూడా..

మార్చి 23 న కూడా దుబాయి నుంచి ముంబై వస్తున్న ఇండిగో విమానంలో ఇద్దరు భారతీయ ప్రయాణికులు విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. మద్యం మత్తులో దత్తాత్రేయ, డిసౌజా అనే ఇద్దరు ప్రయాణికులు విమాన సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. ముంబైలో ల్యాండ్ అయిన తరువాత విమాన సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు తో పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.